ఒక సినిమా తీయడం అంటే మాములు విషయం కాదు అన్న సంగతి అందరికి తెలిసిందే.సినిమాకు వెన్నెముకగా ఉండే దర్శకుడికి 24 క్రాఫ్ట్స్ ను మేనేజ్ చేయగల సత్తా ఉండాలి.రేయింపవళ్ళు కష్టపడి నిద్ర కూడా మర్చిపోయి సినిమా చేసిన కూడా ఆ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చితేనే హిట్ అవుతుంది.లేదంటే కష్టపడి తీసిన సినిమా కాస్త ప్లాప్ అవుతుంది.సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ప్లాప్ కూడా చవిచూడని దర్శకులు ఉన్నారు.వాళ్ళు ఎవరంటే….
రాజమౌళి:ఇప్పటి వరకు కెరీర్ లో ప్లాప్ లేని దర్శకుడు అంటే ముందుగా అందరికి గుర్తుకువచ్చే పేరు రాజమౌళి అని చెప్పచ్చు.స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా రాజమౌళి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో కూడా ఘనవిజయం సొంతం చేసుకొని విదేశాలలో కూడా తన సత్తా చాటారు.ఇప్పటి వరకు ఈయన కెరీర్ లో వచ్చిన సినిమాలు అన్ని కూడా హిట్ గా నిలిచాయి.

అట్లీ:తమిళ్ యంగ్ డైరెక్టర్లలో ఒకరైన అట్లీ ఇప్పటి వరకు తన కెరీర్ లో ప్లాప్ ఎరుగరు.ఇప్పటి వరకు ఈయన కెరీర్ లో తెరకెక్కించిన సినిమాలు అన్ని కూడా హిట్ అయ్యాయి.ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన రాజారాణి సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ప్రశాంత్ నీల్:కన్నడ సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్.ఇప్పటి వరకు ఈయన కూడా ప్లాప్ అందుకోలేదు.కెజిఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ సంచలన విజయం తర్వాత ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయనున్నారు ప్రశాంత్ నీల్.

లోకేష్ కనకరాజ్:కట్టి సినిమాతో హిట్ అందుకున్న ఈయన తాజాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు.
రాజ్ కుమార్ హిరానీ:బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కూడా ఇప్పటి వరకు ప్లాప్ అందుకోలేదు.పీకే,త్రి ఇడియట్స్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు రాజ్ కుమార్.

అనిల్ రావిపూడి:ఇప్పటి వరకు ఈయన తీసిన సినిమాలు అన్ని కూడా హిట్ గా నిలిచాయి.ఎఫ్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబు తో సినిమా చేస్తున్నారు.

నాగ్ అశ్విన్:ఎవడే సుభ్రమణ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్.ఆ తర్వాత మహానటి వంటి ఎపిక్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈయన కెరీర్ లో కూడా ఇప్పటి వరకు ప్లాప్ లేవు.
