Home సినిమా దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు కూడా నో చెప్పిన స్టార్ హీరో,హీరోయిన్లు ఎవరో తెలుసా…

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు కూడా నో చెప్పిన స్టార్ హీరో,హీరోయిన్లు ఎవరో తెలుసా…

4
0

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా ఇప్పటి వరకు హిట్ అయ్యాయి.ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి మరియు హీరోలు రాంచరణ్,ఎన్టీఆర్ కు మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది.ఈ సినిమాలో ఇద్దరు హీరోల మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.వీరిద్దరూ మొదటి సారి కలుసుకునే సీన్ మరియు ఇంటర్వెల్ సీన్ అయితే ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి అని చెప్పచ్చు.అయితే రాజమౌళి సినిమాలను ఇప్పటి వరకు చాల మంది హీరోలు రిజెక్ట్ చేయడం జరిగింది.వాళ్ళు ఎవరంటే…

పవన్ కళ్యాణ్:రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అయితే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశారట.

సూర్య:బాహుబలి సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం సూర్యను సంప్రదించినప్పుడు ఆయన నో చెప్పారట.

మోహన్ లాల్:కట్టప్ప పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదించినప్పుడు ఆయన బిజీ గా ఉండడంతో నో చెప్పడం జరిగింది.

వివేక్ ఒబెరాయ్:భల్లాల దేవుడి పాత్ర కోసం మొదట వివేక్ ను సంప్రదించినప్పుడు కొన్ని కారణాల వలన ఆయన రిజెక్ట్ చేశారట.

జాన్ అబ్రహం:భల్లాల దేవుడి పాత్ర కోసం ఈయనను అడిగినప్పుడు నో చెప్పారట.

బాలకృష్ణ:మగధీర సినిమా కోసం ముందుగా బాలకృష్ణ ను అనుకున్నారట.కానీ ఆయన నో చెప్పారని సమాచారం.

హృతిక్ రోషన్:హృతిక్ ను బాహుబలి సినిమాలో హీరోగా ముందు అనుకున్నారట.కానీ అది జరగలేదు.

అమితాబ్ బచ్చన్:కట్టప్ప పాత్ర కోసం ఈయనను అడిగినప్పుడు ఒప్పుకోలేదట.

ప్రభాస్:సింహాద్రి సినిమా కోసం మొదట ప్రభాస్ ను సంప్రదించినప్పుడు నో చెప్పారట.

శ్రీదేవి:శివగామి పాత్ర కోసం శ్రీదేవి ని సంప్రదించినప్పుడు శ్రీదేవి రిజెక్ట్ చేశారట.

శ్రద్ధ కపూర్:ట్రిపుల్ ఆర్ సినిమాలో ఒలీవియా మోరిస్ చేసిన జెన్నీ పాత్ర కోసం ఈమెను సంప్రదించగా నో చెప్పడం జరిగింది.

కాజల్:యమదొంగ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నారు.కానీ అది జరగలేదు.

Previous articleప్రస్తుతం టాలీవుడ్ లో ఈ 6 టాప్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…
Next articleపెళ్లి మండపంలో ఒకే సమయంలో ఇద్దరు అక్కచెల్లెళ్లకు తాళి కట్టిన వరుడు…ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here