నిర్మాతలుగా మారి కోట్లు నష్టపోయిన హీరోయిన్ లు ఎవరెవరో తెలుసా…

సినిమా రంగంలో పనిచేసే అందరికి డబ్బుల కొదవ ఉండదు అని అందరు భావిస్తుంటారు.కానీ అలా అనుకోవడం అపోహ మాత్రమే అని చెప్పచ్చు.సినిమా రంగంలో ఒక సక్సెస్ లభిస్తేనే కానీ ఎవరు ఎవరిని నమ్మరు.అయితే సినిమా ఇండస్ట్రీలో బాగా డబ్బులు సంపాదించిన చాల మంది కూడా ఆ తర్వాత సినిమాల్లోనే పెట్టి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.ఈ క్రమంలో చాల మంది హీరోయిన్లు డబ్బులు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు.

సావిత్రి:తెలుగు,తమిళ్ భాషలలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సావిత్రి.ఈమె చిన్నారి పాపలు అనే చిత్రాన్ని నిర్మించి భారీగా నష్టపోయారు.అప్పట్లో సావిత్రి గారు నష్టపోయింది లక్షల్లోనే అయినా ఇప్పటితో పోలిస్తే వంద కోట్లు ఉండవచ్చు అని అంచనా వేయచ్చు.

జయసుధ:జయసుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలతో జయసుధ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ఆ తర్వాత ఆమె కాంచన సీత,కలికాలం,అదృష్టం,వింత కోడళ్ళు వంటి చిత్రాలు నిర్మించి నష్టపోవడం జరిగింది.

భూమిక:ఈమె రెండు కోట్ల బడ్జెట్ తో తకిట తకిట అనే చిత్రన్ని నిర్మించి కోటి పైగానే నష్టపోయారు.

కళ్యాణి:ఈమె k2k ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించి ఓ ద్విపాత్రా చిత్రాన్ని నిర్మించడం జరిగింది.ఈ సినిమా వలన కళ్యాణి చాల నష్టపోయారు.
విజయశాంతి:ఈమె బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన నిప్పురవ్వ అనే చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించారు.ఈ చిత్రంతో ఆమె నష్టపోయినట్లు సమాచారం.

మంజుల ఘట్టమనేని:మంజుల షో చిత్రంలో హీరోయిన్ గా నటించడంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా జరిగింది.ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నాని చిత్రాన్ని కూడా నిర్మించారు మంజుల.ఆ తర్వాత కావ్యాస్ డైరీస్ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రాలు ఆమెకు భారీగా నష్టాన్ని తెచ్చి పెట్టాయని చెప్పచ్చు.

రోజా:ఈమె తన భర్త సెల్వమణి దర్శకత్వం వహించిన ఒక చిత్రానికి నిర్మాతగా ఉన్నారు.ఆ చిత్రంతో భారీగా నష్టపోయినట్లు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు రోజా.

శ్రీదేవి:ఈమె కూడా సహా నిర్మాతగా కొన్ని సినిమాలు చేసి కోట్లు నష్టపోయినట్లు సమాచారం.

ఛార్మి:మెహబూబా,పైసా వసూల్,ఇక తాజాగా లైగర్ వంటి చిత్రాలను నిర్మించి కోట్లు నష్టపోయారు.

సుప్రియ యార్లగడ్డ:అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇటీవలే రాజ్ తరుణ్ తో అనుభవించు రాజా అనే సినిమా ను నిర్మించి నష్టపోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *