ఒక్క సినిమాతో తళుక్కున మెరిసి ఆ తర్వాత కనుమరుగైపోయిన 7 హీరోయిన్లు ఎవరో తెలుసా…!

Tollywood Heroines

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లకు అస్సలు కొదవ ఉండదు.ఒక హీరోయిన్ కాకపోయినా మరొక హీరోయిన్ ఆ సినిమా చేస్తుంది.సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ లు ఇండస్ట్రీలో చాల మందే ఉన్నారు.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ముంబై కి చెందిన హీరోయిన్లు ఉన్నారని చెప్పచ్చు.సినిమా ఇండస్ట్రీలో కొంత హీరోయిన్లకు ఎంట్రీ అద్భుతంగా ఉంది మంచి గుర్తింపు తెచ్చుకున్న కూడా ఆ తర్వాత వాళ్ళు ఇండస్ట్రీలో రాణించడంతో మాత్రం విఫలం అవుతున్నారు.కొంత మంది అయితే కేవలం ఒక్క సినిమా తోనే తళుక్కున మెరిసి మాయమైపోయారు.అయినా కూడా వాళ్ళు నటించిన మొదటి సినిమాతోనే వాళ్ళను గుర్తించుకుంటారు ప్రేక్షకులు.అలా ఒక్క సినిమాతో బాగా గుర్తుండిపోయిన హీరోయిన్లు వీళ్ళే…

అదితి అగర్వాల్:అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన గంగోత్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అదితి.ఈ సినిమాతో ఈమె మంచి గుర్తింపును సంపాదించుకుంది.

నేహా శర్మ:రామ్ చరణ్ హీరోగా పరిచయం అయినా చిరుత సినిమాతో నేహా శర్మ కూడా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ప్రేక్షకులకు ఇప్పటికి చిరుత హీరోయిన్ గానే నేహా శర్మ గుర్తుండిపోయింది.

నికిషా పటేల్:కొమరం పులి సినిమాలో నికిషా హీరో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించింది.కొమరం పులి హీరోయిన్ గా నికిషా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.

మన్మధుడు:అన్షు మన్మధుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత అన్షు కొన్ని సినిమాలలో నటించింది.అయినా కూడా అన్షు మన్మధుడు హీరోయిన్ గానే ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.

అయేషా టాకియా:నాగార్జున కు జంటగా సూపర్ సినిమా లో నటించింది ఈ అమ్మడు.సూపర్ సినిమా హీరోయిన్ గానే ప్రేక్షకులకు ఇప్పటికి గుర్తుండిపోయింది.

నేహా ఒబెరాయ్:బాలు సినిమాలో నటించిన ఈ అమ్మడు ఇప్పటి బాలు సినిమా హీరోయిన్ గానే ప్రేక్షకులకు గుర్తుందని చెప్పచ్చు.

కరిష్మా కోటక్:మెగాస్టార్ చిరంజీవి కు జోడిగా శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో నటించింది ఈ అమ్మడు.ఇప్పటికే కూడా శంకర్ దాదా జిందాబాద్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఫిక్స్ అయిపొయింది కరిష్మా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *