బుల్లితెర మీద టీవీ షోలతో,సినిమా ఈవెంట్లతో యాంకరింగ్ తో బిజీగా ఉండే సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.గత పదిహేను సంవత్సరాల నుంచి తన యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకుంటూ ఇప్పటికి తనకు సాటి ఎవ్వరు లేరు అని సుమ నిరూపిస్తూనే ఉన్నారు.సుమ చేసిన షోలు అన్ని టాప్ టిఆర్పి రేటింగ్స్ దక్కించుకుంటాయి.సుమ కు బుల్లితెర మీద ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వయస్సు మీద పడుతున్న ఎంతో ఉత్సాహంతో షో ను సక్సెస్ చేస్తుంది సుమ.విజయ కుమార్ కలివరపు దర్శకత్వంలో సుమ జయమ్మ పంచాయతీ సినిమా చేసిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.అలా ప్రమోషన్స్ లో వచ్చిన సుమ ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియా తో పంచుకున్నారు.ఈ సినిమాలో సుమ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.అయితే సుమ మీడియాతో మాట్లాడుతూ ఈ కథను నన్ను ప్రధాన పాత్రలో ఉహించుకొని రాసింది కాదని సుమ చెప్పుకొచ్చారు.దర్శకుడు ఈ కథను రమ్యకృష్ణ మరియు అనుష్క ను ప్రధాన పాత్రలో ఉహించుకొని రెడీ చేసారు అని తెలిపింది సుమ.ఈ కథను విజయ్ గత మూడు సంవత్సరాలుగా చాల మందికి వినిపించి చివరకు తన దగ్గరకు వచ్చారని తెలిపింది.
మొదట ఈ కథ విన్నప్పుడు నాకు సందేహం కలిగింది,అయితే దర్శకుడు విజయ్ మీరు ఈ పాత్ర చేయలేరా అని అడిగినప్పుడు….నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను అని సవాలుగా తీసుకోని చేశాను అని సుమ తెలిపారు.ఈ చిత్రం కోసం సుమ శ్రీకాకుళం భాషను ప్రత్యేకంగా నేర్చుకున్నారట.ఇది ఒక మంచి విలేజ్ డ్రామా గా తెరకెక్కబడిందని ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందని సుమ తెలిపారు.ఈ చిత్రంలో కేవలం మీకు జయమ్మ మాత్రమే కనిపిస్తుందని సుమ అస్సలు కనిపించాడని ఆమె చెప్పుకొచ్చారుఇక ఈ సినిమా కోసం నేను 40 రోజులు కేటాయించాము ఆ సమయంలో షో లు చేసుకొని ఉన్న ఎక్కువ డబ్బులే వచ్చేవని జోక్ చేసారు సుమ.చివరలో ఒక నటిగా ఈ పాత్ర చేయడం నాకు ఎంతో తృప్తిగా ఉందని తెలిపారు సుమ కనకాల.