Home సినిమా తమ సినిమాలలో హీరోగా,విలన్ గా చేసిన 10 మంది స్టార్ హీరోలు ఎవరో తెలుసా…

తమ సినిమాలలో హీరోగా,విలన్ గా చేసిన 10 మంది స్టార్ హీరోలు ఎవరో తెలుసా…

0

సినిమా ఇండస్ట్రీలో కొంత మంది విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరో గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు.విలన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారిన తర్వాత మళ్ళి విలన్ గా చేయమంటే చాల మంది నో చెప్తారు.కానీ సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు మాత్రం తమ సినిమాలలో హీరోగా మరియు విలన్ గా కూడా చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.తెలుగుతో పాటు మిగిలిన సినిమా ఇండస్ట్రీలో అలా చేసిన వాళ్ళు చాల మందే ఉన్నారని చెప్పచ్చు.ఆ విధంగా తమ సినిమాలలో హీరోగానూ విలన్ గాను చేసిన వాళ్ళు ఎవరంటే…

కార్తీ:తమిళ్ హీరో కార్తీ కాష్మోరా సినిమా లో హీరోగానూ మరియు విలన్ గాను చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించారు.

విక్రమ్:తమిళ్ హీరో విక్రమ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు విక్రమ్.ఇక ఈయన ఇంకొకడు అనే సినిమాలో హీరోగానూ మరియు విలన్ గాను నటించారు.

కమల్ హాసన్:ఈయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు.ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.కమల్ హాసన్ అభయ్ అనే సినిమాలో హీరోగా,విలన్ గా చేసారు.

రజినీకాంత్:ఇక ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.ఈయన కూడా రోబో మరియు చంద్రముఖి సినిమాలో హీరో గా విలన్ గా రెండు పాత్రలలో నటించి అందరిని మెస్మరైజ్ చేసారు.

సూర్య:గజినీ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సూర్య ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.ఈయన 24 సినిమాలో హీరోగా మరియు విలన్ గా చేసారు.

అజిత్:ఈయన హీరోగానూ మరియు విలన్ గాను చేసిన సినిమా వాలి.రెండు పాత్రలలో నటించి ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

బాలకృష్ణ:నందమూరి బాలకృష్ణ కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈయన సుల్తాన్ సినిమాలో హీరోగా మరియు విలన్ గా రెండు పాత్రలలో అద్భుతంగా నటించారు.

వెంకటేష్:విక్టరీ వెంకటేష్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఇక ఈయన హీరోగానూ మరియు విలన్ గాను చేసిన సినిమా నాగవల్లి.

గోపీచంద్:సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో విలన్ గా చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు గోపీచంద్.ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు.ఇక గౌతమ్ నంద అనే సినిమాలో గోపీచంద్ హీరోగానూ మరియు విలన్ గాను అందరిని ఆకట్టుకున్నారు.

ఎన్టీఆర్:దేశవ్యాప్తంగా ఈయనకు ఉన్న క్రేజ్ గురించి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జై లవ కుశ సినిమాలో మూడు పాత్రలలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు ఎన్టీఆర్.ఇక ఈ సినిమాలో ఈయన హీరోగానూ విలన్ గాను నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here