తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన వాకిలీ సాబ్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే.పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో లాయర్ గా నటించడం ఇదే మొదటి సారి అని చెప్పచ్చు.లాయర్ జాబ్ కి మంచి క్రేజ్ పెరగడంతో చాల మంది ప్రస్తుతం లాయర్ వృత్తిపై గౌరవం పెరిగి లా కోర్స్ చదవడానికి ఇష్టపడుతున్నారు.ఈ విధంగా వాకిలీ సాబ్ సినిమా చాల మందికి కనువిప్పు తెచ్చింది అని చాల మంది చెప్తున్నారు.గతంలో కూడా చాలా మంది హీరోలు లాయర్ పాత్రలలో నటించి అలరించారు.
రాజేంద్ర ప్రసాద్ లాయర్ గా చెట్టు కింద ప్లిడర్ సినిమాలో నటించి నవ్వులు పువ్వులు పూయించారు.సందీప్ కిషన్ కూడా లాయర్ గా తెనాలి రామకృష్ణ సినిమాలో నటించారు.ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారు.నాగార్జున,మోహన్ బాబు అధిపతి సినిమాలో లాయర్ గా అందరిని ఆకట్టుకున్నారు.శ్రీకాంత్ కూడా రాధాగోపాళం అనే సినిమాలో లాయర్ గా నటించడం జరిగింది.
ఇక సూపర్ స్టార్ కృష్ణ గూండారాజ్యం లో ,వెంకటేష్ ధర్మ చక్రం లో,చిరంజీవి అభిలాష లో,ఎన్టీఆర్ లాయర్ విశ్వనాధం,అక్కినేని నాగేశ్వరరావు సుడిగుండాలు లో లాయర్ పాత్రలలో నటించి తమ నట విశ్వరూపాన్ని చూపించారు.ఇంకా సత్యదేవ్ తిమ్మరుసు,గోపీచంద్ పక్క కమర్షియల్ సినిమాలలో లాయర్ పాత్రలో కనిపించారు.ఇలా హీరోలు లాయర్ పాత్రలలో నటించి అందరికి లాయర్ వృత్తి పట్ల ఇష్టాన్ని పెంపొందించారు.