ఈ టీవీలో అంతకంతకూ క్రేజ్ సంపాదించుకుంటూ పోతున్న ప్రోగ్రామ్ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్. 2013లో ప్రారంభించిన ఈ రెండు షోలు దిగ్విజయంగా సాగిపోతూ ప్రేక్షకులను నవ్వుల హరివిల్లుతో ముంచెత్తుతున్నాయి. ఈ షోలో మొదటి నుంచి నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్నారు. టీముల ఎంపిక నుంచి మంచి డజ్జిమెంట్లతో ప్రోగ్రామ్ ను లీడ్ చేసేవారు. ప్రతీ గురు, శుక్రవారాల్లో రాత్రి తెలుగు రాష్ర్టాల ప్రేక్షకులు, తెలుగు తెలిసిన వారు సైతం టీవీలకు అతుక్కుపోయేవారు. ఇంత పాపులర్ అయిన షోకు రెమ్యునరేషన్ చెల్లించడంలో ఈ టీవీ యాజమాన్యం అప్పట్లో వెనక్కి కూడా తగ్గలేదు.
అప్పట్లో నాగబాబు, రోజా జడ్జిలుగా ఉండగా ప్రస్తుతం నాగబాబు జీ టీవీలో ప్రసారమయ్యే అదిరింది షోకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఇటు రాజకీయాలను అటు షోలను సమన్వయం చేసుకునేంది. ఇటీవల వైసీపీ ప్రభుత్వం రోజాకు మంత్రి పదవి ఇచ్చింది. ఈ పదవిలో ఉంటూ ఎలాంటి షోలు చేయనని ఆమె ప్రకటించింది. దీంతో మళ్లీ ఈ టీవీ జడ్జిల వేటలో పడింది. పాపులర్ నటి కోసం గాలింపులో పడింది ఈటీవీ. కొన్న రోజులు హోస్ట్ లతో ప్రోగ్రామ్ లను లాగించేశారు.

ఇప్పుడు జబర్దస్త్ కు జడ్జిలుగా వ్యవహరిస్తున్నది ప్రధానంగా నటి ఇంద్రజ, సింగర్ మను. ఇంద్రజ రోజా సమకాలీన నటీమణులు ఇద్దరికి తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో మంచి క్రేజే ఉంది. అందం అభినయం వీరిద్దరి సొంతం. దాదాపు కృష్ణ నుంచి అలీ వరకు టాప్ హీరోలు, కమెడీయన్లతో నటించారు ఇంద్రజ. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. పెండ్లి చేసుకొని సినీ పరిశ్రమను కొన్ని రోజులు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ అడుగుపెట్టారు. కొన్ని షోస్, టీవీ సీరియళ్లు చేయాలని వెడితెరను విడిచిన ఇంద్రజ ఇప్పుడు బుల్లి తెరవైపు వచ్చారు. మొదట ఈ టీవీ ప్లస్ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరించారు. ఆమె అభినయం చూసిన నిర్వాహకులు, రోజా వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో జబర్దస్త్‌కు రావాలని కోరారు. పాపులర్ షో కాబట్టి ఆమె కూడా ఒకే అన్నారు.

కట్ చేస్తే ఇంద్రజ, మనుతో జబర్దస్త్ జడ్జిలుగా కొనసాగుతున్నారు. అప్పట్లో నాగబాబు, రోజాలు ఒక్కో ఎపిసోడ్ కు రూ. 5లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటే ఈ అమ్మడికి తక్కువే చెల్లిస్తున్నారు. ఇంద్రజ ఒక్కో ఎపిసోడ్ కు రూ. 2 లక్షల చెప్పొన నెలకు రెండు షోల(జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్) కు కలిసి రూ. 16 లక్షలు చెల్లిస్తున్నారు. ఇక సింగర్ మను ఎపిసోడ్ కు రూ. 1 చొప్పున, నెలకు రూ. 8 లక్షలు తీసుకుంటున్నారు. యాంకర్ నుంచి టీమ్ మెంబర్ల వరకు ఈ టీవీ ఈ ఒక్కో షోకు దాదాపు 12లక్షల 50 వేలు నెలకు రూ. 62 లక్షలు ఖర్చు పెడుతుంది.
