ఈ సంవత్సరంలో రెండవ సూర్య గ్రహణం అక్టోబర్ 25 న ఏర్పడనుంది.ఈ సంవత్సరం ఇది ఆఖరి సూర్యగ్రహణం.పాక్షిక సూర్యగ్రహణంతో పాటు ఈ సూర్యగ్రహణం ఈ సంవత్సరం చివరిది.భారత్ తో పాటు ఈ సూర్యగ్రహణం ఐరోపా,ఈశాన్య ఆఫ్రికా దేశాలు,పశ్చిమాసియాలో ఏర్పడనుంది.ఇక భారత్ లో ఇది కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపించే అవకాశం ఉంది.
సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికీ మంచి ఫలితాలు,కొందరికి మధ్యస్థ ఫలితాలు మరి కొందరికి అయితే వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటుంది.అయితే ఏ రాశుల వారికీ మంచి ఫలితాలను ఇస్తుందంటే…తులా రాశి వారు ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడకుండా ఉంటేనే మంచిదని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

ఇది స్వాతి నక్షత్రంలో సంభవించింది కాబట్టి సింహరాశి,వృషభం,మకరం,ధనుస్సు రాశుల వారికి శుభఫలితాలను ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు.ఇక కన్య రాశి,మిథునం,మేషరాశి,కుంభరాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు.ఇక మిగిలిన కర్కాటకం,తులా,మీనం,వృశ్చిక రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయని నిపుణులు తెలిపారు.