కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుపతిలో వరదలు ముంచెత్తాయి.తిరుపతిలోని అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి.ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తుతుండడంతో తిరుపతిలో ప్రాంతాలన్నీ నదులులాగా మారిపోయాయి.అక్కడ చుట్టుపక్కల ఎక్కడ చుసిన కూడా వరద నీళ్ళే ఉన్నాయి.తిరుపతిలోని కాలనీలు అన్ని వరద నీటితో నదులుగా మారడంతో కంటి ముందే వాహనాలు,జంతువులూ ఆ వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి.
ఇంటిలోని వస్తువులు అన్ని కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి.మునుపెన్నడూ ఇలాంటి దృశ్యాలను చూడలేదని తిరుపతి వాసులు చెప్పడం జరిగింది.ఈ ఉప్పొంగుతున్న వరద నోటినుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి దేవుడా అంటూ అక్కడి వాసులు సామజిక మాధ్యమాల్లో పోస్ట్లు సైతం పెడుతున్నారు.
#Tirupati India#ClimateEmergency pic.twitter.com/aafe1I2kIj
— Sonnenschein 𓀡 (@SonnenscheinDnz) November 18, 2021
1996 సంవత్సరం తర్వాత మల్లి ఇప్పటి వరకు ఇలాంటి వరదలు చూడలేదని తిరుపతి వాసులు చెప్తున్నారు.అక్కడ పోటెత్తుతున్న వరదలకు భారీగానే ఆస్తి నష్టం జరిగిందని చెప్పవచ్చు.రోడ్లు అన్ని జలమయం కావడంతో వాహనాలు కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి
😞😞😞😞Domestic animals are floating in #Tirupati 🙏 pic.twitter.com/zCK5SiF8yn
— Odisha JanaSena Party (@P89311193Pspk) November 18, 2021