పాన్ ఇండియా తరహా మూవీస్ చేస్తూ మన హీరోలు చిత్ర సీమను ఏలుతున్నారు. టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు లోకల్ గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంటున్నాయి. ఇటీవల మన హీరోల మధ్య చిన్న పోటీ జరిగింది. ఇప్పుడు అది ఇండస్ట్రీలో టాపిక్ గా మారింది ఇంతకీ ఆ పోటీ ఏంటీ.. ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.
రాంచరణ్, మహేశ్ బాబు, ప్రభాస్ వీరి ఇరి స్టా గ్రామ్ అఫీషియల్ పేజెస్ లో ఎవరు ముందు 9 మిలియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ దగ్గర అవుతారోనని ఇందులో రాంచరణ్ విన్ అయ్యాడు అనుకోండి. తర్వాత కొద్ది కాలంలోనే ప్రభాస్, మహేశ్ లు కూడా 9 మిలియన్స్ ఫాలోవర్స్ ను దాటేశారు. ఇది వేరే విషయం.
ఇక అసలు విషయానికొస్తే ఏ ఏ హీరోకు ఇన్ స్టాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసుకోవాలని అభిమానులకు సైతం ఆసక్తి మొదలైంది. ఇందులో ఏ ఏ హీరోకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో టాప్ 10లో ఎవరు ఉన్నారో ఓ లుక్కేద్దాం..

అల్లు అర్జున్
‘గంగోత్రి’తో ఎంట్రీ ఇచ్చిన అర్జున్ ‘ఆర్య’తో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా ‘పుష్ప’తో ఆ క్రేజీన్ మరింత పెంచుకున్నాడు. ఇక అతని ఇన్ స్టాలో ఫాలోవర్స్ విషయానికి వస్తే టాప్ లో ఉన్నారు. 20 మిలియన్ మార్కు చేరువలో ఉన్నాడు బన్నీ. ఫ్యాన్స్ ను అలరించడంలో ఆయన స్టయిలే వేరు.

విజయ్ దేవరకొండ
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో సినీ ఇండస్ట్రీని తన వైపునకు చూసేలా చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి లాంటి చిత్రాలే కాకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘గీత గోవిందం’ లాంటి మూవీస్‌లో కూడా అలరించారాయన. ఇటీవల ఆయన చేసిన ‘లైగర్’ అంతగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఎలాంటి తేడా లేదంటాడు దేవరకొండ. తన ఇన్ స్టా ఖాతాలో 17.7 మిలియన్స్ ఫాలోవర్స్‌తో సెకండ్ ప్లేస్‌ను ఆక్రమించారు.

రామ్ చరణ్
మెగా వారసుడు రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో 9.3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ‘మగధీర’ నుంచి రామ్ చరణ్ క్రేజ్ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు రాంచరణ్. ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో కూడా రిలీజైంది. ఏది ఏమైనా రాంచరణ్ ఖాతాలో 9.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రభాస్
‘బాహుబలి’తో ఫ్యాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఆ తర్వాత ఆయన ఎంచుకునే చిత్రాలు ఆ లెవల్ లో ఉండాలని చూస్తున్నారు. తర్వాత ‘సాహో’ తీశారు. ఇది కూడా బాగానే ఆడింది. రీసెంట్ గా ఆయన చేసిన మరో చిత్రం ‘ఆది పురుష్’ ట్రైలర్ విడుదలైంది కూడా ఇక ఆయన ఇన్ స్టాలో 9 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్నారు.

మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 9 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్నారు. మహేశ్ ఇన్ స్టాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరట. ట్విటర్ లో మాత్రం ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ యాక్టివ్ గా ఉంటారట. అయినా ఆయన అఫీషియల్ పేజ్ లో మాత్రం ఫాలోవర్స్ తగ్గకుండా చూసుకుంటారట.

నాగచైతన్య
అక్కినేని వారసుడు నాగ చైతన్య ఇన్ స్టా ఖాతాలో 7.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సమంతతో ఉన్న సమయంలో అతని ఫాలోవర్స్ కొంచెం పెరిగినా, వారు విడిపోయిన తర్వాత కొంత తగ్గారట.

నాని
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాల ఎంపికలో నానిది అందవేసిన చెయ్యనే చెప్పాలి. మంచి మంచి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగే కథలను ఎంచుకొని వాటికి కామెడీ జోడిస్తూ ఆడియన్స్ ను అలరిస్తారాయన. ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. తన ఇన్ స్టా ఖాతాలో 5.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఎన్టీఆర్ (జూనియర్)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక్కో వేదికలో ఒక్కోలా ఉన్నా. డ్యాన్స్, అభినయంతో అలరిస్తారాయన. ఆయనకు సోషల్ మీడియా వేదికగా ఉన్న ఇన్ స్టాలో 4.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

రానా దగ్గుబాటి
‘లీడర్’ నుంచి మంచి క్రేజ్ లో ఉన్న రాణా ‘బాహుబలి’లో విలన్ గా గుర్తింపు దక్కించుకున్నారు. నటనలో అన్ని షేడ్లు చూపించారు ఆయన. ఆయనకు ఇన్ స్టాలో 4.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

రామ్ పోతినేని
ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇన్ స్టాలో ఆయన యాక్టివ్ గానే ఉంటారట. ఆయనకు 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.