ఐటెం సాంగ్స్ చేసే డ్యాన్సర్లను పెండ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా..!

Tollywood heroes who married item song dancers

అగ్ర నాయకులుగా గుర్తింపు పొందాలంటే శ్రమించక తప్పదు. చాలా రకాల పాత్రల్లో నటించి మెప్పించి వారికంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటారు. డైరెక్టర్లు కూడా నటుల ఫిజిక్స్ తగ్గ పాత్రలను ఇస్తూ వారిలో ఉన్న టాలెంట్ ను బయటకు తేవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారనే చెప్పాలి. చిరంజీవి, వెంకటేశ్, బాలక్రిష్ణ, నాగార్జున, తదితర నటులు వైవిద్యమైన పాత్రలు చేస్తూ కమర్షియల్ గా మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. 

మంచి నటనను ప్రదర్శించే వారిని ఎప్పుడూ అక్కున చేర్చుకోవడంలో టాలీవుడ్ ముందు వరుసలో ఉంటుంది. తమను ఎప్పుడూ అభిమానించే ఫ్యాన్స్ కు తగ్గట్లుగా కథలను ఎంచుకోవడంలో నటులు నిత్యం పరిశ్రమ చేస్తూనే ఉన్నారు. చూసే వారి అభిరుచిని పట్టి ఇండస్ర్టీ కూడా పంతా మార్చకుంటూ వస్తోంది. వైవిద్యమైన కథ, కథనంతో డైరెక్టర్లు ప్రేక్షకులను సీట్లకు అతుక్కునేలా చేస్తున్నారు. ఇలా చాలా మంది దర్శకులు, నటులు మంచి సక్సెస్ లను వెనకేసుకుంటున్నారు. 

వీళ్లను గురించి కొంచెం పక్కన పెడితే మూవీలో ఐటం సాంగ్స్ చేసే వారి జీవితాల్లోకి ఒక సారి వెళ్లి చూద్దాం. వారి వివాహం, ప్రస్తుతం వారున్న తీరును పరిశీలిద్దాం. గత జమానాలో సినిమాలో ఐటం సాంగ్స్ చేసేందుకు పర్టిక్యులర్ తారలు ఉండేవారు. జయ మాలిని, సిల్క్ స్మిత, డిస్కోశాంతి. వారు కనిపించిన ఒక్క పాటతోనే ప్రేక్షకులను, అభిమానులను కన్నార్పకుండా చేసేవారు. బాక్సాఫీస్ హిట్ లో తమకుంటూ గుర్తింపు ఉంటుందని భావించేవారు. కాని రెమ్యునరేషన్ లో కొంత వెనకబడ్డారనే చెప్పాలి. ఇప్పుడు జమానా మారింది. ఐటం సాంగ్స్ సైతం ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఫేమస్ హీరోయిన్లు చేస్తుండడంతో వారికి ఆదరణ తగ్గుతూ వస్తోంది. 

ఐటం సాంగ్స్ చేయడంలో జయ మాలిని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పుడే వచ్చిన మరో తార సిల్క్ స్మిత ఆమె ‘బావలూ.. సయ్యా’ అంటూ తెలుగు ప్రేక్షకులతో వరుస కలుపుకున్నారు. ఇక తర్వాత వచ్చిన మరో ఐటం సాంగ్ గర్ల్ డిస్కోశాంతి.

Sri Hari
Sri Hari

డిస్కో శాంతి-శ్రీహరి

డిస్కోశాంతి ఐటం సాంగ్ గర్ల్ గా మంచి గుర్తింపు తెచ్చకుంది. సిల్క్ స్మితకు తాను ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంది. అందమైన హావభావాలు ‘డిస్కో’ సొంతం. ఇండస్ర్టీలో ఆమెకు పరిచయం అయ్యాడు శ్రీహరి. ఆయన కూడా మంచి గుర్తింపు ఉన్న నటుడు. మొదట్లో శ్రీహరి విలన్ పాత్రలు పోషించే వారు. ఆయన విలనిజం రావుగోపాల రావు జమానాను దాటి ఉందంటే సందేహం లేదు. తర్వాత మెల్లమెల్లగా హీరో అవకాశాలు వచ్చాయి శ్రీహరికి. పోలీస్ క్యారెక్టర్ లో ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ తెలుగు అభిమానుల మనసులో గుర్తుండిపోయాయి. ‘భద్రాచలం’లో ఆయన నటన విమర్శల ప్రశంసలు కూడా అందుకుంది. ఆయన డిస్కో శాంతిని పెండ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అనారోగ్యంతో ఆయన మరణించడంతో చిత్ర సీమ ఒక మంచి నటుడిని కోల్పోయింది.  

jd chakravarthy
jd chakravarthy

జేడీ చక్రవర్తి-అనుకృతి శర్మ

రాంగోపాల్ వర్మ శిష్యుడిగా, వర్మ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరో నటుడు జేడీ చక్రవర్తి. ‘శివ’లో విలన్ గా ఆయన పర్మార్మెన్స్ అభిమానులు ఎన్నటికీ మరిచిపోలేదు. తర్వాత ఆయన హీరోగా కూడా అనేక సినిమాల్లో నటించారు. బొంబాయి ప్రియుడు, ప్రమకు వేళాయరా..తో పాటు  హర్రర్ సినిమాల్లో సైతం  ఆయన నటించి మెప్పించారు. తన గురువు రాం గోపాల్ వర్మ తీసిన శ్రీదేవి సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ చేసిన అనుకృతి శర్మను వివాహం చేసుకున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *