March 26, 2023

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల ప్రతి సినిమాలోనూ ఖచ్చితంగా కనిపించే నటులు ఎవరో తెలుసా…

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు హిట్ అవడం కొన్ని సినిమాలు ప్లాప్ అవడం వంటివి సర్వసాధారణమే.సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ సినిమాలో ఏ ఏ పనులు,ఏ నటులు కలిసొచ్చాయి వాటిని మళ్లీ తర్వాతి సినిమాలకు రిపీట్ చేస్తుంటారు దర్శకులు మరియు హీరోలు.సినిమా ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ డైరెక్టర్ లు మరియు హీరోలు తమ సినిమాలలో నటీనటుల విషయంలో ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు.అలా కొందరు దర్శకుల సినిమాలలో ఖచ్చితంగా కనిపించే నటులు ఎవరంటే…

పూరీజగన్నాధ్:పూరీజగన్నాధ్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ కనిపించే నటుడు సుబ్బరాజు.అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా నుంచి కూడా సుబ్బరాజు పూరీజగన్నాధ్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ కనిపిస్తారు.

రాజమౌళి:రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ కనిపించే నటుడు చంద్రశేఖర్.యమదొంగ,బాహుబలి చిత్రాలు తప్పించి రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలలోనూ కీలకమైన పాత్రలలో చంద్రశేఖర్ నటించారు.

హరీష్ శంకర్:హరీష్ శంకర్ ప్రతి సినిమాలోనూ కనిపించే నటుడు రావు రమేష్.మిరపకాయ్ సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ రావు రమేష్ ను రిపీట్ చేస్తారు హరీష్ శంకర్.

త్రివిక్రమ్:ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలలో ఎక్కువగా కనిపించే నటుడు అమిత్ తివారి.త్రివిక్రమ్ ప్రతి సినిమాలోనూ అమిత్ తివారి కనిపించడం జరుగుతుంది.

 

అలాగే ఆర్జీవీ సినిమాలలో తనికెళ్ళ భరణి

కృష్ణ వంశి సినిమాలలో బ్రమ్మాజి

శ్రీకాంత్ అడ్డాల చిత్రాలలో రావు రమేష్ కనిపించడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *