Tollywood Heroes Remuneration: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.అలా తెలుగు సినిమా ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మాత్రం రాజమౌళికి దక్కుతుంది అనడంలో సందేహం లేదు.బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసారు.ట్రిపుల్ ఆర్ సినిమాతో తన మార్కెట్ ను మరింత పెరిగేలా చేసారు దర్శక ధీరుడు రాజమౌళి.ఓటిటీ పెరిగిన తర్వాత నాన్ థియరిటికల్ రైట్స్ కూడా బాగా పెరగడంతో హీరోలు కూడా రెమ్యూనరేషన్ ను బాగా పెంచేశారు.సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు 15 కోట్లు పారితోషకం తీసుకునే హీరోలు ఇప్పుడు వందల కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని చెప్పచ్చు.తాజాగా స్టార్ హీరోలు యెంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటే…
ప్రభాస్:బాహుబలి సినిమాతో ప్రభాస్ మొదటి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం ఆయన చేస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నిటికీ వంద కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.ఇక ప్రభాస్ సందీప్ వంగ తో చేయబోయే స్పిరిట్ సినిమాకు ఏకంగా 150 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్:పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొదటి రోజు ఆయన సినిమాకు వచ్చే కలెక్షన్లు మరే టాలీవుడ్ హీరోకు రావు అని చెప్పచు.ఆయన చేసిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలకు ఆయనకు 50 కోట్లు పారితోషకం ఇచ్చారు నిర్మాతలు.ప్రస్తుతం చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు ఆయనకు 65 కోట్లు పారితోషకం అందుతుందని సమాచారం.
మహేష్ బాబు:శ్రీమంతుడు సినిమా నుంచి మహేష్ బాబు సినిమా పారితోషకం బదులు పార్ట్నర్ గా ఉంటున్నారు.అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమాకు 65 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం.
రామ్ చరణ్:ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఈయన 45 కోట్లు పారితోషకం తీసుకున్నారు.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమాకు 65 కోట్లు తీసుకుంటున్నారు.
ఎన్టీఆర్:ట్రిపుల్ కు ఎన్టీఆర్ కూడా 45 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నారు.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు 60 కోట్లు పారితోషకం అందుకుంటున్నారని సమాచారం.
అల్లు అర్జున్:పుష్ప సినిమాతో ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్.పుష్ప మొదటి భాగానికి ఈయన 40 కోట్లు తీసుకున్నారు.అయితే పుష్ప రెండవ భాగానికి మాత్రం పార్టనర్ షిప్ అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి.