టాలీవుడ్ లో ఒకే టైటిల్ తో రిలీజ్ అయినా 10 సినిమాలు యేవో తెలుసా…అందులో ఏవి హిట్ అంటే…

టాలీవుడ్ లో లవ్ బ్యాక్ గ్రౌండ్,యాక్షన్,థ్రిల్లర్ మరియు క్రైమ్ ఇలా రకరకాలా కథాంశాలతో చాల చిత్రాలు తెరకెక్కాయి.ఒక సినిమాకు కథ యెంత ముఖ్యమో,టైటిల్ కూడా అంతే ముఖ్యం అన్న సంగతి అందరికి తెలిసిందే.ఒక సినిమా టైటిల్ ను నిర్ణయించటానికి దర్శకనిర్మాతలు తలలు బద్దలు కొట్టుకుంటారు.టైటిల్ విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు అస్సలు వెనుకడుగు వేయరు అని చెప్పచ్చు.అయితే సినిమా కథకు తగిన టైటిల్ ను పెట్టేందుకు కొన్ని కొన్ని సార్లు దర్శకనిర్మాతలు పాత సినిమాల టైటిల్స్ ను కూడా పెడుతుంటారు.గతంలో ఉన్న టైటిల్ ఇప్పుడు ఒకటి రెండు సార్లు కూడా రిపీట్ అయినా సందర్భాలు ఉన్నాయి.

ఒకే టైటిల్ తో రెండు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.కానీ ఒకే టైటిల్ తో మూడు సినిమాలు కూడా వచ్చాయని చెప్పచ్చు.చిరంజీవి హీరోగా చేసిన చిత్రం ఖైదీ ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది అని చెప్పచ్చు.ఆ తర్వాత ఖాదీ నెంబర్ 150 కూడా చిరంజీవి గారే చేయడం జరిగింది.ఇక ఇదే టైటిల్ తో మూడో సారి కార్తీ హీరోగా నటించడం జరిగింది.ఇక 1986 లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం రాక్షసుడు.ఇక తమిళ్ హీరో సూర్య కూడా ఇదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఇదే టైటిల్ తో మూడో సారి బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఒక సినిమా చేయడం జరిగింది.

1953 సంవత్సరంలో దేవదాసు సినిమా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది.2016 లో ఇదే టైటిల్ తో రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఇక ఇదే టైటిల్ తో నాగార్జున,నాని కూడా ప్రేక్షకులను అలరించారు.అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఇప్పట్లో మహేష్ బాబు గారు శ్రీమంతుడు అనే ఒకే టైటిల్ తో సినిమా చేయడం జరిగింది.వెంకటేష్ మరియు నితిన్ కూడా శ్రీనివాస కళ్యాణం అనే ఒకే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మహర్షి టైటిల్ తో వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్స్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం ఎంతటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక అదే టైటిల్ తో విజయదేవరకొండ మరియు సమంత కూడా ఒక సినిమా చేస్తున్నారు.వెంకటేష్ మరియు రామ్ కూడా గణేష్ అనే టైటిల్ తో సినిమా చేయడం జరిగింది.పవన్ కళ్యాణ్ మరియు వరుణ్ తేజ్ కూడా తొలిప్రేమ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక బాలకృష్ణ గారు మరియు కార్తీ సుల్తాన్ అనే ఒకే టైటిల్ తో ప్రేక్షకులను అలరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *