ఆశని తుఫాను,అకాల వర్షాలు మరియు ఎండవేడి కారణంగా ఏపీ లో టమాటా ధరలు చుక్కలను తాకుతున్నాయి.ఏపీ లో టమాటా ధరలు అమాంతం పెరిగి కిలో రూ 60 నుంచి రూ 80 కు చేరుకున్నాయి.వీటితో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి.వీటిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ మాట్లాడుతూ టమాటాలు కొరత కారణంగానే వాటి ధర పెరిగింది అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం టమాటాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.
వేసవిలో టమాటాలు దిగుబడి తగ్గడంతో ప్రైవేట్ వ్యాపారాలు వాటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిపారు.వేసవిలో పంట సరిగ్గా పండకపోవటం,పండిన కాస్త పంట కూడా ఆశని తుపాన్ కారణంగా దెబ్బ తినడం వంటి కారణాల వలన టమాటా ధరలు పెరిగాయని ఆయన తెలిపారు.దాంతో టమాటకు గిరాకీ బాగా పెరిగిపోయి మే 19 న కిలో టమాటా ధర ఏకంగా వంద రూపాయలు చేరుకుంది.

రైతు బజారులో కిలో టమాటా 70 రూపాయలు ఉంటె బయట మార్కెట్ లలో వీటి ధర వంద కు పైగా పలుకుతుంది.ఇలా టమాటా ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం ఒక ఊరట నిచ్చే విషయం తెలిపింది.మే 19 న రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్ ఫుడ్ ప్రోసెసింగ్ శాఖల మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల మే 12 నుంచి టమాటా లు రైతు బజార్ లలో సరసమైన ధరలకే విక్రయించనున్నట్లు తెలిపారు.