Home ట్రెండింగ్ కరెంటు షాక్ తగిలిన వ్యక్తికీ వెంటనే CPR చేసి ప్రాణం కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్…వీడియొ వైరల్…

కరెంటు షాక్ తగిలిన వ్యక్తికీ వెంటనే CPR చేసి ప్రాణం కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్…వీడియొ వైరల్…

0

లా అండ్ ఆర్డర్ మైంటైన్ చేయడంతో పాటు పోలీసులు తమ సమయస్ఫూర్తిని ఉపయోగించి ప్రజల ప్రాణాలను కూడా కాపాడుతున్నారు.ప్రాణాపాయంలో ఉన్న బాధితులను కాపాడడంలో వేగంగా స్పందిస్తున్నారు పోలీసులు.పోలీస్ CPR చేసిన ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడడం జరిగింది.హైదరాబాద్ లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో కరెంటు షాక్ తగిలిన ఒక వ్యక్తికీ వెంటనే స్పందించి CPR చేసి ఒక కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడడం జరిగింది.

బంజారాహిల్స్ లో ఒక వ్యక్తి అనుకోకుండా కరెంటు షాక్ కు గురై కిందపడిపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలు హుటాహుటిన అక్కడి చేరుకోవడం జరిగింది.కానిస్టేబుల్ బోలు అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఛాతీపై రెండు చేతులు పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ ఆ వ్యక్తి శ్వాస ప్రక్రియ సాధారణ స్థాయికి వచ్చేవరకు అక్కడే ఉంది సపర్యలు చేసాడు.

అతని ప్రయత్నాలు ఫలించి ఆ వ్యక్తి స్పృహలోకి రావడం జరిగింది.అదే సమయంలో అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్ లో అతనిని ఆసుపత్రికి తరలించడం జరిగింది.మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.అయితే దీనికి సంబంధించిన వీడియొ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలు సమయస్ఫూర్తికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here