ట్రిపుల్ ఆర్ నుంచి అదిరిపోయే ఎన్టీఆర్ న్యూ లుక్….మరి ట్రైలర్ ఎప్పుడో తెలుసా..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ గా వస్తున్నా ఈ చిత్రం కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు రామ్ చరణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆతురుతతో వేచి ఉన్నారు.దీనికి కారణం ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్లు,సాంగ్స్,వీడియొ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7 న రిలీజ్ కానున్న సంగతి అందరికి తెలిసిందే.ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.అయితే ముందు ట్రైలర్ ను డిసెంబర్ 3 న విడుదల చేయాలి అనుకున్నారు.కానీ ప్రముఖ గేయ రచయితా అయినా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం,మరి కొన్ని కారణాల వలన ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ను వాయిదా వేశారు చిత్ర నిర్వాహకులు.ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం డిసెంబర్ 9 న ట్రిపుల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రం నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర నిర్వాకులు.ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ శరీరమంతా రక్తంతో రెండు చేతులతో తాడులు ఆగ్రహంతో పట్టుకొని ఉన్నారు.ఇక ఈ కొమరం భీం పోస్టర్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు పోస్టర్లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రామ్ చరణ్ కు సంబంధించిన పోస్టర్ ను సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *