స్టార్ హీరోలకు జోడిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…

సినిమా ఇండస్ట్రీలో నటి నటులకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి క్యారక్టర్ ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరో హీరోయిన్లు అందరు కూడా అభిమానులకు చేరువగా ఉంటున్నారు.ఇక స్టార్ హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియా వేదికగా రోజు వైరల్ అవుతూనే ఉన్నాయి.అభిమానులు కూడా తమ ఇష్టమైన హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చూడడానికి చాల ఆసక్తి చూపిస్తుంటారు.అభిమానులు కూడా ఇలా వైరల్ అయినా తమ ఇష్టమైన స్టార్స్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలో రామ్ చరణ్,ఎన్టీఆర్,అల్లు అర్జున్,మహేష్ బాబు,సమంత,కాజల్,రష్మిక ఇలా చాల మంది సౌత్ స్టార్స్ తో పాటు నార్త్ స్టార్స్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతుంటాయి.ఇదే క్రమంలో ప్రస్తుతం బూరెబుగ్గలతో క్యూట్ గా ఉన్న ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈమె తెలుగుతో పాటు తమిళం లో కూడా చాల సినిమాలలో నటించింది.ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు నీ మనసు నాకు తెలుసు అనే చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనా త్రిష.

మొదటి సినిమాతోనే తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యిన త్రిష ఆ తర్వాత వర్షం,నువ్వొస్తానంటే నేనొద్దంటానా,అతడు,సైనికుడు,పౌర్ణమి,బుజ్జిగాడు,స్టాలిన్ వంటి పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,హిందీ,మలయాళం లో పలు చిత్రాలలో నటిస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీ గా ఉంది.ప్రస్తుతం త్రిష మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియం సెల్వన్ సినిమాలో నటిస్తుంది.ఈ రోజు అంటే మే 4 న త్రిష పుట్టినరోజు సందర్భంగా త్రిష చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *