చంద్రముఖి 2 లో జ్యోతిక పాత్రలో భయపెట్టబోయే స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా….

2005 సంవత్సరంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అప్పట్లో హర్రర్ సినిమాలలో ఈ చిత్రం ఒక ల్యాండ్ మార్క్ ను క్రియేట్ చేసిందని చెప్పచ్చు.ఈ చిత్రానికి పి వాసు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు జ్యోతిక,నయనతార,ప్రభు అద్భుతంగా నటించారు.తెలుగు తమిళ్ భాషలలో రిలీజ్ అయినా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

Chandramukhi 2
Chandramukhi 2

దాదాపు 17 ఏళ్ళ తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రానుంది.ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా హౌస్ లైక ప్రొడక్షన్స్ అధికారికంగా ఇటీవలే చంద్రముఖి సినిమా కు సీక్వెల్ ను ప్రకటించింది.పి వాసు చంద్రముఖి సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర లో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా టైటిల్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది.అయితే మొదటి భాగం లో జ్యోతిగా ఏ రేంజ్ లో అందరిని భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Chandramukhi 2 Trisha
Chandramukhi 2 Trisha

ప్రస్తుతం తెరకెక్కబోతున్న చంద్రముఖి సీక్వెల్ లో ఏ హీరోయిన్ టైటిల్ రోల్ లో కనిపించనుంది అని అందరిలో ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే తెలుగు,తమిళ్ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిష ఈ సినిమాలో టైటిల్ రోల్ లో కనిపించనుందని సమాచారం.కోవిద్ కారణంగా సినిమాలను తగ్గించిన త్రిష ప్రస్తుతం కోవిద్ నుంచి కోలుకోవడంతో వరుసగా సినిమాలు చేస్తుంది.ఈ క్రమంలోనే చంద్రముఖి 2 లో త్రిష నటించేందుకు ఆసక్తి చూపిస్తుందని వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *