tulsi plant
- ఆధ్యాత్మికం

ఇంట్లో తులసి మొక్క ఉందా…అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి…

వాస్తు శాస్త్రంలో తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి,ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవడానికి కుటుంబ సమస్యలు తొలగిపోవడానికి తులసి పూజ ఉపయుక్తం అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తుంటారు.తులసి తో చాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇంట్లో తులసి మొక్కను ఎక్కడ పడితే అక్కడ నటకూడదంట.ఇంట్లో తులసి మొక్కను ఏ దిశలో నాటాలి,మొక్కకు నీళ్లు ఏ సమయంలో పోయాలి,పూజ ఏ సమయంలో చేయాలి అనే విషయాలు కూడా తెలిసి ఉండాలి అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెపుతున్నారు.

అలా చేస్తేనే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి ఇబ్బందులు తొలగిపోతాయి అని నిపుణులు చెపుతున్నారు.తులసి మొక్కను వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తారు.తులసి మొక్కను ఇంట్లో సరైన దిశలో పెడితే లక్ష్మి దేవి ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుందని చాల మంది నమ్ముతారు.ఈ మొక్కను ఎప్పుడు కూడా దక్షిణ దిశలో నటకూడదంట.లేకపోతె అనేక సమస్యలు ఎదురుకోవలసి వస్తుందని నిపుణులు చెపుతున్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్క ఎక్కడ ఉంటె అక్కడ లక్ష్మి దేవి ఉంటుందని అందరు విశ్వసిస్తారు.

tulsi plant
tulsi plant

ఈ మొక్క అనేక అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది.ఈ మొక్క ఇంట్లో సరైన దిశలో నాటడం వలన అనేక సమస్యలు తొలగిపోయి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని చాల మంది నమ్మకం.ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని చాల మంది విశ్వసిస్తారు.ఇంట్లో ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.ఈ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ప్రశాంతత,ఆనందం కలుగుతాయని చాల మంది నమ్మకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *