Viral Video: బంగారం షాపులలో అనేక రకాల మోసాలు జరుగుతాయి అని అందరికి తెలిసిందే.అందుకే చాల మంది తెలిసిన షాపులలోనే బంగారం కొనడానికి,పాత బంగారం అమ్మటానికి ప్రాధాన్యత ఇస్తారు.తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు కిలాడీ లేడీలు బంగారం షాపులో ఆ వ్యాపారస్తుడిని బురిడీ కొట్టించిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతుంది.కస్టమర్స్ లా ఆ బంగారం షాపులోకి వెళ్లిన ఇద్దరు లేడీలు పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొంటామని చివరకు నకిలీ బంగారాన్ని ఇచ్చారు.కస్టమర్స్ లాగ బంగారం కొనడానికి వచ్చాము అంటూ బంగారం షాపులో ఎంట్రీ ఇస్తారు.అక్కడ ఉన్న యజమానిని,అక్కడ పని చేసే వాళ్ళను,అక్కడ ఉన్న పరిస్థితులను క్షణాల్లో అవపోశన పట్టేస్తారు.
ఆ షాపుకి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళ లాగ అక్కడ ఉన్న సిబ్బంది తో మాట కలిపేస్తారు.మీ ఓనర్ గారు బాగున్నారా..ప్రస్తుతం ఉన్నారా లేదా అంటూ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళ లాగా కుశల ప్రశ్నలు వేస్తారు.ఆ తర్వాత మేము పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొనాలని వచ్చాము అని అంటారు.ఇక టెస్టింగ్ కి అసలైన బంగారాన్ని ఇస్తారు.ఆ తర్వాత తూకం వేసిన తర్వాత అసలైన నాటకాన్ని స్టార్ట్ చేస్తారు.వాళ్ళు షాపులోకి వచ్చే ముందే వారి దగ్గర ఉన్న అసలైన బంగారం లానే ఉన్న నకిలీ బంగారు ఆభరణాన్ని కూడా చేయించుకొని వస్తారు.
ఇక అసలైన బంగారం తూకం వేసిన తర్వాత ధర పెంచమని బేరమాడి ఆ తర్వాత ధర కుదరలేదని తాము ఇచ్చిన బంగారాన్ని వెనక్కి తీసుకోని హ్యాండ్ బాగ్ లో వేసుకుంటారు.అలా హ్యాండ్ బాగ్ లో వేసుకున్న తర్వాత మల్లి మనసు మార్చుకొని సరే మీ చెప్పిన రేటుకే కొత్త బంగారం ఇవ్వండి అంటూ అప్పటికే హ్యాండ్ బాగ్ లో పెట్టుకున్న నకిలీ బంగారాన్ని తీసి ఇస్తారు.ఆ నకిలీ బంగారం బరువు,డిసైన్ మొత్తం ఒకే విధంగా ఉండడం తో షాపు వారు ఆ నకిలీ బంగారాన్ని తీసుకోని మోసపోతున్నారు.శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ నెల చివరలో చొరబడిన ఈ ముఠా సభ్యులు జిల్లా వ్యాప్తంగా పలు బంగారం షాపులలో చోరీకి పాల్పడ్డారు.పలు దుకాణాలలో చోరీ చేసి సుమారు పది లక్షలు విలువ చేసే 176 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు.
View this post on Instagram