చాల మంది ఉదయం నిద్ర లేచిన తర్వాతి సమయం చాల విలువైనదిగా భావిస్తారు.ఉదయం నిద్ర లేచిన వెంటనే పొందిన శక్తి రోజంతా మనతోనే ఉంటుంది అని చాల మంది నమ్ముతారు.అన్ని మాటలలోను ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానాలు చేసి పూజలు చేసి వ్యాయామం చేస్తుంటారు.దీని ఫలింతంగా పొందే శక్తి రోజంతా మనతోనే ఉండి మనం చేసే పనుల మీద ప్రభావం చూపుతుంది.అలా పూజలు చేయడం వలన వ్యాయామం చేయడం వలన రోజంతా శక్తివంతంగా,చురుకుదనంతో ఉంటారు.అలా కాకుండా చాల మంది ఉదయం లేచిన వెంటనే కొన్ని తప్పుడు పనులు చేస్తారు.అలా చేయడం వలన ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఆ ప్రభావం రోజంతా కూడా ఉంటుంది.ఇలా ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని పనులు అస్సలు చేయకూడదు అని జ్యోతిష్యం ప్రకారం,వాస్తు శాస్త్రం ప్రకారం నిపుణులు చెప్తున్నారు.అవి ఏంటంటే…
అద్దంలో చూడకూడదు:
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో చూసుకోకూడదు అని నిపుణులు చెప్తున్నారు.కొందరికి నిద్ర లేవగానే అద్దంలో చూసే అలవాటు ఉంటుంది.అలా చూడడం వలన ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఆ ప్రభావం మనిషి ఆలోచనలపై పడుతుందట.దాంతో ఆ రోజు చేసే పనులు ముందుకు కదలవు అని నిపుణులు సూచిస్తున్నారు.
కిచెన్ లో అంట్ల గిన్నెలు చూడకూడదు:
రాత్రి భోజనం చేసిన తర్వాత అంట్ల గిన్నెలను మరుసటి రోజు ఉదయం కడగవచ్చు అని వాయిదా వేయకూడదు.ఒకవేళ షింక్ లో అంట్ల గిన్నెలు ఉన్న కూడా ఉదయం లేచిన వెంటనే చూడకూడదు.అలా చూడడం వలన ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.
ఇంట్లో నిలిచి పోయిన గడియారాన్ని చూడకూడదు:
ఇంట్లో నిలిచి పోయిన గడియారం ఉన్నట్లయితే నిద్ర లేచిన వెంటనే దానిని చూడకూడదు.అలా చూసినట్లయితే లేని పోనీ గొడవలు ఏర్పడి అశుభం జరుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు.
జంతువుల చిత్రపటాలు:
చాల మంది ఇళ్లలో గోడలపై జంతువుల చిత్ర పటాలు పెట్టుకుంటారు.నిద్ర లేచిన వెంటనే జంతువుల చిత్రపటాలు చూడకూడదు.దానివలన ప్రతికూల పరిస్థితులు ఏర్పడి వివాదాలు,గందరగోళాలు ఏర్పడతాయి.
నిద్రలేవగానే ఏం చేయాలి అంటే:ఒక వ్యక్తి అదృష్టం అరచేతుల్లోనే దాగి ఉంటుందట.అందుకే నిద్ర లేచిన వెంటనే రెండు అరచేతులను చూసుకొని దేవుడిని తలచుకోవాలి అని నిపుణులు చెప్తున్నారు.