తెలుగు సినిమా ఇండస్ట్రీకి ముందుగా రచయితగా పరిచయం అయ్యి ఆ తర్వాత దర్శకుడిగా ఎదిగారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటూ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన జులాయి,అతడు,అత్తారింటికి దారేది,అల వైఖుంతపురములో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.అల వైఖుంతపురములో సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆ చిత్రం షూటింగ్ లో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచుకున్నారు.
సాధారణంగా ఎప్పుడు కూడా తన భార్య సౌజన్య ను షూటింగ్ లకు తీసుకువెళ్లలేదని తెలిపారు.అల వైకుంఠపురములో సామజవరాగమనా పాట షూటింగ్ కోసం పారిస్ వెళ్లాల్సి వచ్చినప్పుడు తన భార్య ను కూడా షూటింగ్ కు వెంట తీసుకోని వెళ్లానని తెలిపారు.కానీ తన భార్య రెండు రోజులకే నిరసించిపోయిందని తనను వదిలేసి ఇంటికి వచ్చేసిందని సరదాగా చెప్పుకొచ్చారు త్రివిక్రమ్.2002 సంవత్సరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌజన్యను వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు.త్రివిక్రమ్ భార్య సౌజన్య మంచి క్లాసికల్ డాన్సర్.త్రివిక్రమ్,సౌజన్య ది పెద్దలు కుదిర్చిన పెళ్లి.ఇటీవలే జరిగిన ఆమె డాన్స్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం జరిగింది.విదేశాలలో కూడా త్రివిక్రమ్ భార్య సౌజన్య డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు.ఈమె ప్రముఖ లిరిక్స్ రైటర్ సిరివెనెల్ల సీతారామశాస్త్రి గారికి మేనకోడలు అవుతారు.