హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మెగా కోడలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే అపోలో హాస్పిటల్ మ్యానేజ్మెంట్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు.రామ్ చరణ్ భార్యగానే కాకుండా సేవ కార్యక్రమాల ద్వారా కూడా ఉపాసన కు భారీ స్థాయిలో గుర్తింపు మరియు ఫాలోయింగ్ ఉన్నారు.తాజాగా ఉపాసన అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఆడి ఈ ట్రాన్ కారును కొనుగోలు చేసారు.ఈ కారు ఖరీదు కోటి ఇరవై లక్షలు ఉంటుందని సమాచారం.
తాజాగా ఉపాసన తన కొత్త కారుకు సంబంధించిన వీడియొ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియొ కు రికార్డు స్థాయి లో లైకులు వస్తున్నాయి.కంగ్రాట్స్ వదిన అంటూ మెగా అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కారు లక్జరీ గా ఉండడంతో పాటు కార్ కలర్ కూడా బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఆమె కొనుగోలు చేసిన కారు మెగా రేంజ్ కు తగినదిగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.తన కెరీర్ లో రామ్ చరణ్ సక్సెస్ సాధించటంలో ఉపాసన పాత్ర కూడా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్ కెరీర్ పెళ్లి తర్వాత మరింత పుంజుకుందని అభిమానులు భావిస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అటు సినిమాలతో పాటు ఇటు బిజినెస్ తో కూడా ఫుల్ బిజీ గా ఉన్నారు రామ్ చరణ్.ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.అయితే ఉపాసన చరణ్ సినిమాలో కనిపిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.అయితే భవిష్యత్తులో అభిమానుల కోరిక మేరకు ఉపాసన రామ్ చరణ్ సినిమాలో కనిపిస్తారేమో వేచి చూడాల్సిందే.