ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 7 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేస్తారు.మూత్రంతో పాటు శరీరంలో ఉండే టాక్సిన్స్ కూడా బయటకు వస్తాయి కాబట్టి ఇది సహజమైన ప్రక్రియ.అయితే మూత్రం రంగును బట్టి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకోవచ్చు.ల్యాబ్ పరీక్షా ద్వారా కాకుండా ఇంట్లో నే మూత్రం రంగును బట్టి అనేక రకాల వ్యాధులను గుర్తించవచ్చు.ప్రతిరోజూ మూత్రం రంగుతో పాటు మూత్రం విసర్జించే పరిమాణం పై కూడా శ్రద్ధ తీసుకోవాలి.మూత్రం ఏ రంగులో ఉంటుంది,రోజుకు ఎన్ని సార్లు విసర్జిస్తూ ఉన్నారు మరియు రోజుకు యెంత పరిమాణంలో మూత్రం విసర్జిస్తున్నారు అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యం.కొంతమందికి పదే పదే మూత్రం వస్తుంది అని వాష్ రూమ్ కి వెళుతుంటారు.కానీ వాళ్లకు చుక్కలు చుక్కలుగా మూత్రం వస్తుంది.కొన్ని సందర్భాలలో ఈ పరిస్థితి నిర్జలీకరణాన్ని కూడా చూపిస్తుంది.ఆరోగ్యంగా ఉండే వ్యక్తి మూత్రం రంగు నీరు లేదా లేత పసుపు రంగులో ఉంటుంది.యురోక్రోమ్ అనే రసాయనం శరీరంలో ఉత్పత్తి అవడం దీనికి కారణం అని చెప్పచ్చు.
చిక్కటి పసుపు రంగు:మీ శరీరం డిహైడ్రేట్ అవుతుంది అనడానికి ఇది సంకేతం.వ్యక్తి శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది.ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం,నిమ్మరసం,కొబ్బరి నీళ్లు,పాలు తాగడం వలన ఈ లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు.ఇలా చేయడం వలన మూత్రం రంగు సాధారణ రంగులో వస్తుంది.
లేత పసుపు రంగు:ఈ రంగు కూడా మీరు తాగే నీరు మీ శరీరానికి సరిపోదు అని సూచిస్తుంది.కాబట్టి ప్రతిరోజూ ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి.మూత్రపిండ వ్యాధి లేక మధుమేహం కారణంగా కూడా మూత్రం రంగు లేత పసుపు రంగులో ఉంటుంది.
పొగమంచు లేదా మేఘావృతం:మూత్రాశయం ఇన్ఫెక్షన్ వలన లేదా అనేక వ్యాధుల వలన కూడా ఇలా జరుగుతుంది.వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
ఎరుపు రంగు:అనేక కారణాల వలన మూత్రం ఈ రంగులో కనిపిస్తుంది.ఆహారంలో బీట్ రూట్ లేదా దాని రసాన్ని తాగితే మూత్రం రంగు ఎరుపు రంగులో ఉంటుంది.మందుల వలన కూడా ఈ రంగులో ఉంటుంది.మూత్రం లో రక్తం ఉన్న మూత్రం ఎరుపు రంగులో ఉంటుంది.వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.కిడ్నీ వ్యాధి,కిడ్నీ ఇన్ఫెక్షన్,అంతర్గత గాయం,కాన్సర్ వంటి వ్యాధుల కారణం కూడా కావచ్చు.
గోధుమ రంగు:కాలేయం లేదా పిత్తాశయం ఇన్ఫెక్షన్ కారణంగా కూడా మూత్రం ఈ రంగులో వస్తుంది.పిట్టా వాహికలో ఏదైనా అడ్డుపడటం లేదా గాయం కారణం కూడా కావచ్చు.గాల్ బ్లాడ్డర్ ఇన్ఫెక్షన్ వలన కూడా మూత్రం ఈ రంగులో వస్తుంది.
ఆకుపచ్చ,గోధుమ రంగులో మూత్రం:ఎక్కువగా ఇంగ్లీష్ మందులు తీసుకోవడం,రంగు రంగుల ఆహార పదార్ధాలను తీసుకోవడం దీనికి కారణం.ఇలా ఏమి చేయనప్పుడు కూడా ఈ వింత రంగులో మూత్ర వస్తున్నట్లయితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.