Vaishnavi Chaitanya: డబ్ స్మాష్ వీడియోలతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత టిక్ టాక్ తో,ఇంస్టాగ్రామ్ రీల్స్ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.ఆ క్రేజ్ తోనే,ఫాలోయింగ్ తోనే ఈ అమ్మడు యు ట్యూబ్ వీడియోస్ తో పలు షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.పలు సినిమాలలో కూడా ఈమె చిన్న చిన్న రోల్స్ లో కనిపించింది.త్రివిక్రమ్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైఖుంఠపురం లో సినిమాలో వైష్ణవి అల్లు అర్జున్ చెల్లెలిగా ఆకట్టుకుంది.తాజాగా వైష్ణవి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమాలో తన నటనతో అందరిని కట్టిపడేసింది వైష్ణవి.ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించడం జరిగింది.
బేబీ సినిమాతో వైష్ణవి పేరు ఎక్కడ చూసిన మారుమోగిపోతుంది.బేబీ సినిమా చూసిన వాళ్ళందరూ వైష్ణవి చైతన్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు.సినీ సెలెబ్రెటీలు సైతం ఆమె నటనను మెచ్చుకుంటున్నారు.ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత వైష్ణవి కి పలు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇదే క్రమంలో ఆమె ఒక బంపర్ ఆఫర్ ను దక్కించుకుందని కూడా టాక్ వినిపిస్తుంది.వైష్ణవి కి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారట దర్శకుడు పూరీజగన్నాధ్.
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యిందని సమాచారం.ఇక ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా పూరి జగన్నాధ్ వైష్ణవి చైతన్య ను అనుకున్నట్లు సమాచారం.బేబీ సినిమాలో ఆమె నటనకు ఫిదా అయినా పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇటీవలే వైష్ణవి నటనను మెచ్చుకుంటూ ఆమెకు బొకేను పంపించారు హీరో రామ్ పోతినేని.వైష్ణవి డబుల్ ఇస్మార్ట్ సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో ఆమె రేంజ్ మారిపోవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.