దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం చాల వాయిదాల తర్వాత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అయితే భారీ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం థియేటర్ లలో రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామి సృష్టించి.అన్ని భాషలలో ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.అయితే ఇటీవలే ప్రముఖ ఓటిటీ లో కూడా రిలీజ్ అయ్యి ఈ చిత్రం అదరకొడుతుంది.ఈ చిత్రం ఇంతలా హిట్ అవ్వడానికి ఒక కారణం రాజమౌళి అయితే మరొక కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఈ చిత్రంలో నటించడం అని చెప్పచ్చు.
అయితే చిత్రం లో హీరోలుగా నటించిన రామ్ చరణ్,ఎన్టీఆర్ కూడా తమలోని నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించారు.ఈ చిత్రం లో అజయ్ దేవగన్,అలియా భట్,శ్రియ ఇలా పలువురు ముఖ్య పాత్రలలో కనిపించరు.ఈ చిత్రంలో రామ్ చరణ్ చిన్నప్పటి పాత్రలో కనిపించిన కుర్రాడికి కూడా ఈ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది.ఈ అబ్బాయి పేరు వరుణ్ బుద్ధదేవ్.ఫ్లాష్ బ్యాక్ లో 15 నిమిషాల వరకు కనిపించే రాజు చిన్నప్పటి పాత్రలో ఈ అబ్బాయి చాల బాగా నటించాడు.వరుణ్ పలు హిందీ సినిమాలలో మరియు ప్రకటనలలో నటించాడు.
ఈ అబ్బాయికి ఇది మొదటి తెలుగు సినిమా.ఇతను మంచి డాన్సర్ కూడా.తన డాన్స్ కు సంబంధించిన వీడియోలను ఎప్పుడు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటాడు.అయితే చిన్నప్పటి సీతారామరాజు పాత్ర కోసం రాజమౌళి వెతుకుతున్న సమయంలో వరుణ్ గురించి తెలిసి ఆడిషన్స్ కి పిలిచారు.ఈ పాత్రకి వరుణ్ సూట్ అవుతాడు అని అనిపించడంతో అతనిని సెలెక్ట్ చేసారు రాజమౌళి.అలా వరుణ్ RRR చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నాడు.