Varun Tej-Lavanya Tripathi: వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇప్పటికే మొదలయిన సంగతి అందరికి తెలిసిందే.మరికొన్ని గంటల్లో వీరిద్దరూ వివాహ బంధం తో ఒక్కటి కానున్నారు.సోమవారం సన్నిహితుల మధ్య కాక్ టైల్ పార్టీ ఘనంగా జరిగిన సంగతి అందరికి తెలిసిందే.ఇక మంగళవారం రోజున వరుణ్,లావణ్య హల్దీ ఫంక్షన్ ఇరువురు కుటుంబసభ్యులు,సన్నిహితుల మధ్య జరిగింది.పసుపు రంగు దుస్తుల్లో వరుణ్,లావణ్య ముస్తాబయ్యారు.
వరుణ్ పసుపు రంగు కుర్తా,వైట్ ప్యాంటు ధరించగా,లావణ్య పసుపు రంగు లెహంగా ధరించారు.వరుణ్,లావణ్య హల్దీ ఫంక్షన్ థీమ్ ను పసుపు,తెలుపు డిసైన్ చేసినట్లు తెలుస్తుంది.ఇక ఈ హల్దీ వేడుకకు సంబంధించిన కొన్ని ఆకట్టుకునే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వైరల్ అవుతున్న ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ ఇద్దరు కూడా పసుపు రంగు దుస్తుల్లో కనిపించారు.
వరుణ్,లావణ్య వివాహం నవంబర్ 1 న మధ్యాహ్నం ఇరువురు కుటుంబసభ్యులు మరియు పలువురు సినీ ప్రముఖులు,సన్నిహితుల మధ్య ఘనంగా జరగనుంది.ఇప్పటికే ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఇరువురు కుటుంబసభ్యులు,సినిమా ప్రముఖులు ఇటలీ చేరుకున్నారు.ఈ రోజు కూడా మరికొంత మంది సినిమా ప్రముఖులు,వరుణ్ స్నేహితులు,లావణ్య స్నేహితులు ఇటలీ వెళ్తున్నట్లు సమాచారం.సమంత,చైతన్య తో పాటు మరికొంత మంది సినిమా సెలెబ్రెటీలు వరుణ్,లావణ్య పెళ్లి కి వెళ్తున్నట్లు సమాచారం.
View this post on Instagram