Varun Tej-Lavanya Tripathi Marriage: గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి నిన్న ఇటలీ లో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.వీరిద్దరి పెళ్లి నిన్న మధ్యాహ్నం ఇటలీ లోని టస్కనీ లో ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది.వరుణ్,లావణ్య (varun tej ,lavanya ) పెళ్ళికి పలువురు సినీ ప్రముఖులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.వీరి పెళ్లి సెలెబ్రేషన్స్ అక్టోబర్ 30 నుంచే స్టార్ట్ అయినా సంగతి అందరికి తెలిసిందే.
ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాలలో కాక్ టైల్ పార్టీ,హల్దీ,మెహందీ,సంగీత్ కు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ వైరల్ అయ్యాయి.అయితే పెళ్లి తర్వాత కొత్త జంట నమస్కరిస్తున్న ఫోటోను నాగబాబు షేర్ చేయగా ఆ ఫోటో క్షణాల్లో వైరల్ అయ్యింది.ఈ ఫోటో ను పోస్ట్ చేస్తూ నాగబాబు నూతన వధూవరులకు మీ ఆశీస్సులు కోరుతున్నాము అని రాసారు.
ఈ పెళ్లి వేడుకలో మెగా,అల్లు కుటుంబాలు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకోని పెళ్లి లో హాజరయ్యారు.నితిన్ తన భార్య షాలిని తో కలిసి వరుణ్,లావణ్య (varun ,lavanya )పెళ్లి వేడుకలో హాజరయ్యారు.ఇక నవంబర్ 5 న హైదరాబాద్ లోని మాదాపూర్ యెన్ కన్వెన్షన్ లో వీరి రిసెప్షన్ జరగనుంది.ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram