Varun Tej-Lavanya Tripathi: వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 1 న మధ్యాహ్నం ఇటలీ లో జరుగుతున్నా సంగతి అందరికి తెలిసిందే.ఈ వేడుకలో హాజరయ్యేందుకు ఇప్పటికే ఇరువురు కుటుంబ సభ్యులు,వరుణ్,లావణ్య స్నేహితులు,పలువురు సినీ ప్రముఖులు ఇటలీ చేరుకున్నారు.అక్టోబర్ 30 నుంచే వీరిద్దరూ పెళ్లి వేడుక మొదలయిపోయింది.ఇప్పటికే కాక్ టైల్ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అయ్యాయి.ఈ పార్టీ లో రామ్ చరణ్ ఉపాసన దంపతులు,అల్లు అర్జున్ దంపతులు ఈ పార్టీ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
ఇక నిన్న అంటే మంగళవారం రోజు హల్దీ వేడుక జరిగింది.ఈ వేడుకలో డ్రెస్ కోడ్ పసుపు,తెలుపు రంగులో డిసైన్ చేయించడం జరిగింది.వరుణ్,లావణ్య పసుపు రంగు దుస్తుల్లో హల్దీ ఫంక్షన్ లో కనిపించారు.వరుణ్,లావణ్య హల్దీ ఫంక్షన్ వేడుక ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అయినా సంగతి తెలిసిందే.ఇక ఈ హల్దీ ఫంక్షన్ లో చిరంజీవి,చిరంజీవి భార్య సురేఖ పసుపు రంగు దుస్తుల్లో కనిపించారు.
తాజాగా వరుణ్,లావణ్య మెహందీ ఫంక్షన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఈ హల్దీ ఫంక్షన్ వేడుకలో మెగా,అల్లు ఫ్యామిలీతో పాటు హీరో నితిన్ కూడా తన భార్య తో కలిసి సందడి చేసారు.వరుణ్,లావణ్య తో కలిసి నితిన్ తన భార్యతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.ఈ మెహందీ ఫంక్షన్ వేడుకకు పలువురు సినీ ప్రముఖుల తో పాటు అత్యంత సన్నిహితులు కూడా హాజరయ్యారు.
View this post on Instagram