Varun Tej – Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ రోజు వేదమంత్రాల సాక్షిగా కుటుంబసభ్యులు,అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.ఇటలీ లోని టుస్కానీ లో వీరిద్దరి పెళ్లి ఈ రోజు మధ్యాహ్నం 2 గంట 48 నిమిషాలకు ఘనంగా జరిగింది.మెగా అల్లు కుటుంబాలతో,పలువురు సినీ ప్రముఖులు,వరుణ్ లావణ్య స్నేహితులు ఈ వేడుకలో హాజరయ్యారు.
వరుణ్,లావణ్య పెళ్లి ఫోటోను నాగబాబు ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకోవడం జరిగింది.ఈ పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ నాగబాబు నూతన వధూవరులైన వరుణ్ తేజ్ కొణిదెల,లావణ్య కొణిదెల కోసం మీ ఆశీసులను కోరుతున్నాము అంటూ రాసుకొచ్చారు.నూతన వధూవరులైన వరుణ్,లావణ్య ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Also Read : వరుణ్,లావణ్య మెహందీ ఫంక్షన్ లో సందడి చేసిన అల్లు అర్జున్ ఫ్యామిలీ,నితిన్ ఫ్యామిలీ…ఫోటోలు వైరల్
డిసైనర్ దుస్తుల్లో వరుణ్,లావణ్య ఎంతో అందంగా కనిపిస్తున్నారు.లావణ్య రెడ్ కలర్ లెహంగా లో వరుణ్ గోల్డ్ కలర్ షేర్వాణీ లో చూడముచ్చటగా ఉన్నారు.ఈ ఫోటోను చూసిన అభిమానులు,నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram