Home రివ్యూలు వీరసింహారెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్స్…ఫ్యాన్స్ కు పూనకాలే…సినిమా ఎలా ఉందంటే…

వీరసింహారెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్స్…ఫ్యాన్స్ కు పూనకాలే…సినిమా ఎలా ఉందంటే…

0
Veera Simha Reddy Movie Review Rating
Veera Simha Reddy Movie Review Rating

Veera Simha Reddy Movie Review Rating:అఖండ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత బాలయ్య టైటిల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా చిత్రం వీరసింహారెడ్డి.క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ట్రైలర్ మాస్ ప్రేక్షకులకు మంచి ఫిస్ట్ అని చెప్పడం లో సందేహం లేదు.మరి ఇలాంటి ఫ్యాక్షన్ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించిందో తెలుసుకుందాం.

Veera Simha Reddy Movie Review Rating

కథ:జయసింహారెడ్డి (బాలయ్య) ఇస్తాంబుల్ లో రాయలసీమ వంటలు వండే హోటల్ బిజినెస్ మరియు ఆటో మొబైల్ బిజినెస్ చేస్తూ తన తల్లి తో కలిసి ఆనందంగా బ్రతుకుతుంటాడు.కర్నూల్ లోని పులిచర్ల గ్రామా పెద్ద తండ్రి అయినా వీరసింహారెడ్డి ( రెండవ బాలయ్య) తొలిచూపులోనే ఇష్టపడిన ఇషా అంటే శృతిహాసన్ తల్లితండ్రులతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇస్తాంబుల్ వస్తాడు.వీరసింహారెడ్డిని ఎప్పటి నుంచో చంపాలని ఎదురుచూస్తున్న ప్రతాప్ రెడ్డి అంటే దునియా విజయ్ కూడా ఇస్తాంబుల్ చేరుకుంటాడు.ఇస్తాంబుల్ లో తన గ్యాంగ్ తో ప్రతాప్ రెడ్డి వీరసింహారెడ్డి తో తలబడతాడు.ఆ తర్వాత ఏం జరిగింది…అసలు వీరసింహారెడ్డి మరియు ప్రతాప్ రెడ్డి మధ్య వైరం ఏమిటి…ఈ సినిమాలో భానుమతి అంటే వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఏమిటి…అనేది మిగిలిన కథాంశం.

నటీనటుల పనితీరు:తండ్రిగా మరియు కొడుకుగా రెండు పాత్రలలో బాలయ్య జీవించేసారు.వీరసింహారెడ్డి గా వెండితెరపై బాలయ్య వీరంగం ఆడేసారు అని చెప్పచ్చు.వీరసింహారెడ్డి గా ఆయన యాక్షన్ మరియు డైలాగులు అటు మాస్ ఆడియన్స్ తో పాటు బాలయ్య అభిమానులకు కూడా బాగా అలరించాయి.వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పాత్రలో పూర్తి స్థాయిలో తన టాలెంట్ నిరూపించుకున్నారు.భానుమతి పాత్రకు ఆమె ప్రాణప్రతిష్ట చేసింది అని చెప్పడం లో సందేహం లేదు.ఇక మలయాళీ నటి అయినా హాని రోజ్ తన నటనతో,గ్లామర్ తో ప్రేక్షకులను అలరించింది.ఇక కన్నడ నటుడు దునియా విజయ్ సింగల్ ఎక్సప్రెషన్ తో అతని విలనిజం అంతగా ఆకట్టుకోలేకపోయింది అని చెప్పచ్చు.హీరోయిన్ శృతిహాసన్ మూడు నాలుగు సన్నివేశాలకు,రెండు పాటలకు పరిమితం అయిపొయింది.

సాంకేతికవర్గం పనితీరు:ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం బాగా అలరించింది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పేలవమైన సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్ చేసారు తమన్.యాక్షన్ సన్నివేశాలకు తమన్ అందించిన సంగీతం తో థియేటర్లలో పూనకాలే.ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.సాయిమాధవ్ బుర్ర అందించిన మాటలు,డైలాగులకు థియేటర్ లో బాగా రెస్పాన్స్ వచ్చింది.గోపీచంద్ మలినేని దర్శకుడిగా యాక్షన్ సీన్స్ మరియు హీరో ఎలివేషన్స్ తో తన సత్తా చాటుకున్నారు.
రేటింగ్:౩.5 /5 .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here