Home సినిమా వీరసింహారెడ్డి కాకుండా టైటిల్ లో సింహ అనే పేరుతో బాలయ్య ఎన్ని సినిమాలు చేసారో తెలుసా…అందులో...

వీరసింహారెడ్డి కాకుండా టైటిల్ లో సింహ అనే పేరుతో బాలయ్య ఎన్ని సినిమాలు చేసారో తెలుసా…అందులో ఎన్ని హిట్ అంటే…

0

నందమూరి బాలయ్య బాబు (బాలక్రిష్ణ)కు ఫ్యాన్ ఫాలోయింగ్ లో కొదువ లేదు. ఆయన ఎంచుకునే సినిమాలు, కథలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి మరి. సినీ ఇండస్ర్టీలో యువరత్నగా గుర్తింపు తెచ్చుకున్న బాలక్రిష్ణ  ఇప్పుడు ‘నట సింహం’గా పేరుతో దూసుకుపోతున్నాడు. ఆయన సినిమా టైటిల్లో ఎక్కువగా ‘సింహ’ పేరు యాడ్ అవుతూ ఉంటుంది. ఇది కాకతాలీయమా..! లేక కావాలనా.. ఇప్పుడు చూద్దాం..

నందమూరి బాలక్రిష్ణకు దైవభక్తి మెండు. ఆయన ఇండస్ర్టీకి పరిచయమైన కొత్తలో డైరెక్టర్, నిర్మాత సూచనల మేరకే నడుచుకునేవారు. అంత డిసిప్లేన్ గా ఉండేవారు కాబట్టే  సక్సెస్ స్టార్ గా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికీ కొన్ని కొన్ని విసుగు తెచ్చే సందర్భాలు మినహా ఆయన అంతే క్రమ శిక్షణను మేయింటెన్ చేస్తుంటారు. బాలయ్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ తరం మరో నాయకుడికి లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇండస్ర్టీలోకి అడుగు పెట్టిన నాని లాంటి సక్సెస్ హీరోతో పాటు ఎంతో మందికి ఆయన ఫ్యాన్సే. పెట్టినా బాలయ్యే, తిట్టినా బాలయ్యే.. అంటూ అభిమానులు ఆయనను గుండెల్లో పెట్టుకుంటారు. 

ఆయన బేసిగ్గా వీర భక్తుడు. ఆయన శ్రీలక్ష్మీ నృసింహుడికి భక్తుడు. చేతికి ఎప్పటికీ నృసింహుడి బొమ్మ ఉన్న బిల్ల, మెడలో అదే బొమ్మ ఉన్న రుద్రాక్ష కలిగి ఉన్న బిల్ల ఉంటాయి. ఇక మూవీస్ విషయానికి వస్తే ‘సింహా’ టైటిల్ తో సినిమా పేరుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్ముతారు. దానికి తగ్గట్టుగానే దర్శక, నిర్మాతలు ఆయనతో తీసే మూవీస్ పేర్లను కూడా అలాగే ఎంపిక చేస్తారు. ఇక సింహా పేరుతో ఉన్న ఆయన మూవీస్ విషయాలను చూద్దాం..

తాజాగా ఆయన తీయబోయే సినిమా టైటిల్ ‘వీర సింహా రెడ్డి’గా పెట్టారు. చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నది. ఇది ఖచ్చితంగా బక్సాఫీస్ వద్ద మంచి రికార్డులు బద్ధలు కొడుతుందని యూనిట్ భావిస్తోంది..

Veera narsimha reddy

బాలయ్య బాబు, తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేసిన సినిమా 1983లో రిలీజైన ‘సింహం నవ్వింది’ దాసరి యోగానంద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. తర్వాత చాలా భాషల్లో దీన్ని రీమేక్ చేయడం విశేషం. 

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య తీసిన మరో సింహ పేరున్న సినిమా 1994లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బొబ్బిలి సింహం’. బాలయ్య సరసన మీణ నటించగా అన్ని వర్ణాల ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ చిత్రంగా నిలిచింది. 

1999లో బీ గోపాల్ దర్శకత్వంలో బాలక్రిష్ణతో సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవిలు నటించిన సమర సింహారెడ్డి టాలీవుడ్ రికార్డులను తిరగరాసిందనడంలో సందేహం లేదు. ఫ్యాక్షన్ కు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఒక ఫ్యాక్షనే కాదు మంచి డ్రామా, లవ్ ఉన్న ఈ సినిమాకు రూ. 6 ఖర్చు పెడితే.. రూ. 20 కోట్లు వరకు కలెక్షన్ చేసి రికార్డులను తిరగరాసింది. 

ఇక 2001లో వచ్చిన ‘నరసంహ నాయుడు’ గురించి చెప్పుకోవాలంటే బీ గోపాల్ దర్శకత్వంలో బాలయ్యతో సిమ్రాన్, ప్రీతి జింగానియా కలిసి నటించిన చిత్రం. ఆ ఇయర్ లో హైయ్యెస్ట్ వసూళ్లను రాబట్టింది. ఇది గోపాల్ దర్శకత్వంలో బాలక్రిష్ణకు నాలుగో ఫిలి. ఇది 9 కోట్లతో నిర్మిస్తే, 30 కోట్లు తెచ్చిపెట్టింది. 

ఇంకోపేరు ‘సీమసింహం’ గురించి మాట్లాడితే సిమ్రాన్, రీమీసేన్ తో కలిసి యువరత్న జీ రామ్ ప్రసాద్ దర్శకత్వంతో 2002లో తెరకెక్కింది. ఇందులో బాలక్రిష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించారు. 

బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అనగానే పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్, ఫైట్స్ ఉంటాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొట్ట మొదటి హిట్ ‘సింహ’. 2010లో విడుదలైన ఈ మూవీలో బాలయ్య నయనతార, నమిత, స్నేహ ఉల్లాత్ తో యువకుడిగా కనిపపిస్తూ మెప్పించారు. 

ఇక బాలయ్య కెరీర్ లో మాస్ హిట్ మూవీ సింహా టైటిల్ తో వచ్చింది ‘లక్ష్మీ నరసింహా’ తమిళంలో విక్రమ్ తీసిన బ్లాక్ బస్టర్ హిట్ కు ఇది రీమేక్. తెలుగులో కూడా ఇది మంచి కలెక్షన్లను రాబట్టింది. బాలయ్య డైలాగ్స్ యాక్షన్ సీన్స్ ఈ మూవీలో వేరెలెవలనే చెప్పాలి. 

భాష ఏదైనా సింహా పేరుతో ముడిపడితే చాలు అది హిట్టవుతుందనుకుంటారు బాలయ్య. సింహా మీనింగ్ తో 2015లో వచ్చిన ‘లయన్’ బాక్సాఫీస్ వద్ద కొంత చెతికిల పడినా బాలక్రిష్ణ పర్ఫార్మెన్స్ ఉండనే ఉంది. అభిమానులను థియేటర్ తో రెండు గంటల పాటు కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. సింహ టైటిల్ తో 2018లో మరో సినిమా వచ్చింది. కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ ‘జై సింహా’ ఇది కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. యువరత్నకు ఈ సినిమా 102వది. తనకు ఇష్టమైన టైటిల్ తో వచ్చిన ఇది కూడా మంచి హిట్ అయ్యింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here