Home సినిమా హీరో వెంకటేష్ కు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా…

హీరో వెంకటేష్ కు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా…

0
Daggubati Venkatesh
Daggubati Venkatesh

టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటి వరకు వెంకటేష్ తన కెరీర్ లో 80 కు పైగా సినిమాలలో నటించారు.ఇప్పటి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు వెంకటేష్.తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో శోభన్ బాబు తర్వాత ఆ స్థాయిలో ఫ్యామిలీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో వెంకటేష్ అని చెప్పచ్చు.ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కు చాల క్రేజ్ ఉంది.ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయినా నారప్ప,దృశ్యం 2 చిత్రాలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ఈ చిత్రాలను రూ 70 కోట్ల వరకు సురేష్ బాబు అమ్మినట్లు సమాచారం.ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్లుగా సినిమాలను ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు వెంకటేష్.

రామానాయుడు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ తన కెరీర్ ప్రారంభంలోనే విజయాలను అందుకున్నారు.అమెరికా నుంచి వచ్చినప్పటికి ఎమోషనల్,ఫ్యామిలీ సినిమాలకు ఎక్కువగా వెంకటేష్ కనెక్ట్ అవ్వడం విశేషం.ఒక ప్రముఖ నిర్మాత తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగారు వెంకటేష్.అయితే వెంకటేష్ ఎప్పుడు కూడా హీరో అవ్వాలని అనుకోలేదట..బిజినెస్ మ్యాన్ కావాలని అనుకున్నారట.అయితే రాఘవేంద్ర రావు,కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన కలియుగ పాండవులు చిత్రం వెంకటేష్ తో చేయడం జరిగింది.

Daggubati Venkatesh
Daggubati Venkatesh

ఒక వైపు హీరోగా చేస్తూనే మరో వైపు బిజినెస్ మ్యాన్ గా కూడా రాణిస్తున్నారు వెంకటేష్.టాలీవుడ్ లో అత్యధిక నంది పురస్కారాలు అందుకున్న హీరో వెంకటేష్.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 35 ఏళ్ళు అవుతున్న వెంకటేష్ కు ఎన్ని వేల కోట్లు ఆస్తులు ఉంటాయో అని చాల మంది చర్చించుకుంటారు.ఈయన ఇల్లు హైదరాబాద్ లో కొండపై ఇంద్ర భవనం లా ఉంటుంది.సినిమాల నుంచి ఈయన సంపాదించినా మొత్తాన్ని తన అన్నయ్య అయినా సురేష్ బాబు సలహా తో వ్యాపారం తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.మొత్తం కలిపి హీరో వెంకటేష్ ఆస్తి విలువ రూ.2200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.తన తండ్రి నుంచి కూడా వెంకటేష్ కు చాల ఆస్తులు వచ్చినట్లు చెపుతుంటారు.అవన్నీ కలుపుకుంటే ఆయన ఆస్తుల విలువ అయిదు వేల కోట్లకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం వెంకటేష్ నటించిన ఎఫ్ 3 చిత్రం ఈ నెల మే 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here