అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ సినిమాకు నో చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా…

Attarintiki Daredi Movie Rejected Hero

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.ఆయన సినిమాలు అన్ని కూడా ట్రెండ్ సెట్ చేసినవే అని చెప్పచ్చు.ఇప్పటివరకు ఆయన కెరీర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.ఆయన సినిమాలు అనగానే అభిమానులలో భారీగా అంచనాలు నెలకొంటాయి.కాని ఈ మధ్య కాలంలో ఆయన కొన్ని సినిమాలు అభిమానులను నిరాశ పరుస్తున్నాయి.ఇక హరీష్ శంకర్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా గబ్బర్ సింగ్ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం కూడా సంచలన విజయం సాధించింది.కానీ ఈ సినిమా విషయంలో చాల ట్విస్టులు ఉన్నాయి అని చెప్పచ్చు.ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ముందుగా అనసూయ ను అనుకున్నారట.కానీ ఆమె నో చెప్పడంతో హంసానందిని ని ఫైనల్ చేసారు.ఇక ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ను 12 ఏళ్ళ తర్వాత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో తీసుకున్నారు.

అయితే ముందుగా ఈ సినిమాకు హీరోగా వెంకటేష్ ను సంప్రదించారు.కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో,ఆ తర్వాత పవన్ ఓకే చెప్పడంతో ఈ సినిమాతో పవన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఈ సినిమాలో సమంత కు ముందు ఇలియానా ను అనుకున్నారట.కానీ ఆమె బిజీ గా ఉండడంతో డేట్స్ అడ్ జస్ట్ కాకపోవడంతో సమంత ను తీసుకున్నారు.ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ను ఫైనల్ చేసారు.దాదాపు 45 రోజుల పాటు ఈ సినిమాను స్పెయిన్ లో షూట్ చేసారు.

ఇక ఈ సినిమాలో నదియా,పవన్ మధ్య జరిగే కొన్ని సన్నివేశాలకు పవన్ దర్శకత్వం వహించారు అని సమాచారం.రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఈ సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమా 4 ఫ్లిమ్ ఫెర్ అవార్డులు మరియు 6 ఫైమా అవార్డులను దక్కించుకుంది.ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయినా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *