Venky Ravi Teja Sister: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం క్లాసిక్ సినిమాలలో రవి తేజ హీరో గా నటించిన వెంకీ సినిమా కూడా ఒకటి అని చెప్పచ్చు.శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీ లో వస్తే ఎంజాయ్ చేసే ప్రేక్షకులు చాల మందే ఉన్నారు.ఈ సినిమాలోని ట్రైన్ సీన్ ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పచ్చు.ఇప్పటి వరకు ట్రైన్ లో అంత నిడివి ఉన్న సినిమాలు రాలేదు.
రోజంతా కష్టపడి కొంచెం సేపు రిలాక్స్ అవుదాం అని అనుకునే చాల మందికి ఈ సినిమా ఒక మెడిసిన్ లాంటిది అని చెప్పచ్చు.ఇక ఈ సినిమాలో నటించిన అందరి గురించి ప్రేక్షకులకు బాగా తెలుసు.అయితే ఈ సినిమాలో హీరో రవితేజ కు చెల్లెలిగా నటించిన శిరీష గురించి అంతగా ఎవరికి తెలియదు.ఈ సినిమా తర్వాత కూడా ఈమె క్యారక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపుగా ఇరవై కు పైగా సినిమాలలో నటించడం జరిగింది.

కానీ ఒక్క సినిమాలో కూడా ఈమెకు గుర్తుండిపోయే క్యారక్టర్ రాలేదు అని చెప్పచ్చు.దాంతో ఈమె ఆడియన్స్ కు కనెక్ట్ కాలేక పోయింది.సినిమాలతో పాటు ఈమె సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది.సూపర్ హిట్ సీరియల్స్ అయినా నాతి చరామి,అగ్ని పరీక్షా వంటి సీరియల్స్ లో ఈమె ముఖ్యమైన పాత్రలలో నటించడం జరిగింది.ఈమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.