Childhood Pic: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో ఉహించగలరా…తమిళ్,తెలుగు రెండు భాషలలో బాగా ఫేమస్

Childhood Pic

Childhood Pic: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి తండ్రి నుంచి వారసత్వంగా సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.తమిళ్,తెలుగులో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును క్రేజ్ ను సంపాదించుకుంది.తన వాయిస్,పర్సనాలిటీ డిఫరెంట్,తనపై కామెంట్స్ వచ్చిన కూడా ఈమె పట్టించుకోదు.ఎందుకంటె తనకు అవే గుర్తింపును తెచ్చిపెట్టాయి అని చెప్పచ్చు.కొంచెం బొద్దుగా ఉన్న తనదైన నటనాశైలితో అభిమానులను సంపాదించుకుంది.

ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు విద్యు రామన్.ఈమె చెన్నై లో పుట్టి పెరిగింది.ఈమె తండ్రి మోహన్ రామన్ తమిళ్ ఇండస్ట్రీలో మంచి ఫేమస్ ఆక్టర్.2012 లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది విద్యు రామన్.తెలుగు,తమిళ్ సినిమాలలో ఈమె స్టార్ హీరోయిన్లకు స్నేహితురాలిగా నటించడం జరిగింది.

రన్ రాజా రన్,రాజు గారి గది,భలే మంచి రోజు,సరైనోడు,ధ్రువ,నిన్ను కోరి,రాజా ది గ్రేట్,భాగమతి,తొలిప్రేమ,మహర్షి ఇలా పలు సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులకు దెగ్గరయ్యింది.రెండు భాషలలోను మంచి క్యారెక్టర్స్ చేసి ఫిమేల్ కమెడియన్ గా గుర్తింపును సొంతం చేసుకుంది.విద్యు రామన్ తన పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడింది.పెళ్లి తర్వాత విద్యు రామన్ పర్సనల్ లైఫ్ లో బిజీ గా మారిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *