Vijay Antony: బిచ్చగాడు సినిమాతో తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోనీ.బిచ్చగాడు సినిమాలో విజయ్ ఆంటోనీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అప్పటి నుంచి ఆయన సినిమాలకు తెలుగు లో కూడా క్రేజ్ పెరిగింది.ఆ తర్వాత బిచ్చగాడు 2 సినిమాతో మళ్ళీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయ్ ఆంటోనీ.సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.కేవలం హీరో గానే కాకుండా సింగర్ గా,దర్శకుడి గా,మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తన తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోనీ.
బిచ్చగాడు సినిమా తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఆయన సినిమాలకు భారీగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ పెరిగింది.బిచ్చగాడు సినిమా లో విజయ్ ఆంటోనీ నటన ప్రేక్షకుల హృదయాలను తాకింది అని చెప్పచ్చు.ఈ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ సినిమాలకు తెలుగులో కూడా ఫాలోయింగ్ పెరిగిందని చెప్పచ్చు.ఆ తర్వాత మళ్ళీ బిచ్చగాడు 2 సినిమా తో తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్.ఇక బిచ్చగాడు 2 తర్వాత వచ్చిన హత్య సినిమా డిసాస్టర్ గా నిలిచింది.ఇటీవలే విజయ్ ఆంటోనీ జీవితం లో ఒక పెను విషాదం చోటు చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.సెప్టెంబర్ 19 న విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఇంట్లోని తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.

కూతురి అకాల మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన విజయ్ ఆంటోనీ తన కూతురితో పాటు తానూ కూడా చనిపోయానంటూ ట్వీట్ చేసారు.ఇటీవలే శుక్రవారం విజయ్ తన చిన్న కూతురు లారా ఆంటోనీ తో కలిసి రత్తం సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు.తాజాగా విజయ్ ధన దర్శకత్వం వహిస్తున్న తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు.చెందూర్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్న ఈ సినిమాకు హిట్లర్ అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.ఇక ఈ సినిమా నుంచి హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.రియా సుమన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.