విజయ్ దేవరకొండ ఫోన్ కూడా ఎత్తడం లేదంట.. డైరెక్టర్ పూరీతో బంధం తెంచుకున్నాడా..!

దర్శక, హీరోకి మధ్య ‘లైగర్’ చిచ్చు పెట్టింది. ఈ మూవీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండకు తమ కేరీర్ లో మాయని మచ్చలా, మరిచిపోలేని గాయంలా మిగిలింది. ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకోవాలని విజయ్ దేవరకొండ అనుకొని  దానికి తగ్గట్టుగా తన బాడీని మార్చుకున్నాడు. ఫిట్ నెస్ సైతం మెయింటెనెన్స్ చేశాడు. ఇక పూరీ జగన్నాథ్ కూడా ఈ మూవీతో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నించాడట. ఆ సినిమాపై అత్యాశనే కొంప ముంచిందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఈ మూవీ గురించి ఎక్కువే చెప్పారని సినీ ఇండస్ర్టీ భావిస్తోంది. మూవీ ప్రమోషన్ లో విజయ్ దేవరకొండ, నిర్మాత చార్మీ, డైరెక్టర్ పూరీ మాటలు చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశారట. కానీ బాక్సాఫీస్ దరిదాపులకు కూడా రాలేకపోయింది. బోర్ కొట్టించే సీన్లతో, అవుట్ డేటెడ్ స్టోరీ, అంతే అవుట్ డేటెడ్ స్ర్కీన్ ప్లేతో ఎప్పుడు బయటకు వెళ్లాలా అంటూ ప్రేక్షకులు థియేటర్లలో ఉండలేకపోయారట. విజయ్ కి సైతం నత్తి పెట్టి నటనను మొత్తం నాశనం చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. విజయ్ ఈ మూవీ ప్రయోషన్ లో మాట్లాడిన, ఆయన వ్యవహరించిన తీరు బాగానే సినిమా హైప్ ను పెంచాయి.

ఈ మూవీకి కనీసం రూ. 200 కోట్లు వస్తాయని, ఆ తర్వాత వచ్చే డబ్బులను మాత్రమే లెక్కిస్తానని అన్నారు దేవరకొండ. కానీ మొదటికే మోసం వచ్చింది. చిత్రం దారుణంగా దెబ్బ కొట్టింది. సినిమా నిర్మాణం, షూటింగ్, ప్రమోషన్ దశల్లో నిర్మాత, హీరో, డైరెక్టర్ ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించారు. విజయ్ దేవరకొండ డబ్బుల తీసుకోకుండా సినిమా చేశాడని పంపిన డబ్బులను కూడా వెనక్కి ఇచ్చేశాడని చెప్పుకొచ్చారు ఛార్మీ. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమా ప్లాప్ కావడంతో అందరి మధ్య బంధాలు తెగిపోయాయి. విజయ్ మేనేజర్ ఫోన్ చేస్తుంటే పూరీ, ఛార్మీ రెస్పాండ్ కావడం లేదని ఇండస్ర్టీలో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో దేవరకొండ హర్ట్ అయినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *