Vijay Sethupathi: విజయసేతుపతి కి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి గురింపు ఉంది.పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు ఉన్న విజయసేతుపతి( Vijay Sethupathi ) టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు.హీరోగానే కాకుండా నచ్చిన పాత్ర అయితే విలన్ గా,సెకండ్ హీరోగా కూడా తమిళ్,తెలుగు,హిందీ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు విజయ్.
దేశవ్యాప్తంగా తన నటనతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.సినిమాలకు ముందు దుబాయ్ లో పని చేసే విజయ్ ఆన్లైన్ ద్వారా జెస్సి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డారు.ఆ తర్వాత వీరిద్దరూ ఇండియా వచ్చి వివాహం చేసుకున్నారు.2003 లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఒక కూతురు,కొడుకు ఉన్నారు.కూతురు పేరు శ్రీజ,కొడుకు పేరు సూర్య.సూర్య,శ్రీజ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తమిళ్ సినిమాలలో నటిస్తున్నారు.
సూర్య తన తండ్రి విజయసేతుపతి హీరోగా నటించిన నాను రౌడీ దా అనే సినిమాతో సినిమాలలోకి అడుగు పెట్టాడు.ఈ సినిమాలో తన తండ్రి చిన్నప్పటి పాత్రను పోషించాడు సూర్య.ప్రస్తుతం సూర్య నాడు సెంటర్ అనే తమిళ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.కూతురు శ్రీజ కూడా తండ్రి హీరోగా నటించిన ముగిల్ సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
View this post on Instagram