బాల నటులు ఫేమ్ అయిన చిత్రాలు ఒకత్తయితే. వారే తమ అభిమానికి క్రష్ గా మారిన సినిమాలు మరికొన్ని. ఒక సీనియర్ నటుడితో బాల నటిగా నటించిన చిన్నారి పెరిగి పెద్దతై తన అభిమాన నటుడికే ఫేమస్ సినిమాలో క్రష్ గా మారింది. ఇది ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినా.. సినిమాలో అన్ని సాధ్యమే అనడానికి గొప్ప ఉదాహరణ శ్రీదేవి జమానా నుంచి ఇది వస్తూనే ఉంది. ఎన్టీఆర్ కు చిత్రంలో బాలనటిగా ఉన్న ఆమె వేటగాడుతో జతకట్టి తెలుగు ప్రాంతాల్లో మంచి ముద్ర వేసుకున్నారు. ఈ నటి కూడా ఆ కోవకే చెందుతుందనడంలో ఆశ్చరం లేదు మరి.
ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఫ్యాంటసీ మూవీ ‘బాహుబలి’ దేశమే కాకుండా ప్రపంచంలో మంచి ఆదరణ లభించింది. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలనే కోరుకుంటున్నారని గ్రహించిన అగ్ర దర్శకులు కూడా అ దిశగా అడుగులు వేస్తున్నారు. కథకు తగ్గట్లుగా తారాగణాన్ని ఎన్నుకుంటూ సక్సస్ అవుతున్నారు.
మంచి కథ, ఆకట్టుకునే విజువల్స్, భారీ సెట్టింగ్ లతో సినిమా తీస్తే భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. బాహుబలి పాన్ ఇండియా లెవల్లో హిట్ సాధించడంతో చాలా మంది డైరెక్టర్లు తమ కళల ప్రాజెక్టులు కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే భారీ ప్రాజెక్టుతో వచ్చాడు మణిరత్నం. కల్కి క్రిష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ‘పొన్నియిన్ సెల్వన్’ వెండితెరపైకి తీసుకువచ్చాడు. తనకు ఇది బిగ్ ప్రాజెక్ట్ అని 40 సంవత్సరాలుగా దీన్ని సినిమాగా తీయాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు ఆయన. ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. మొదటి భాగం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, తదితర భాషలతో ఒకే రోజు (సెప్టెంబర్ 30) విడుదల చేయగా విజయవంతంగా నడుస్తుందీ చిత్రం.
ఇక విషయానికి వస్తే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది విక్రమ్. ఆయన నటన గురించి పరిచయం అవసరం లేదు. ‘అపరిచితుడు’తో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. అంతలా జీవిస్తున్న ఆయనకు నటన అంటే ఎంత పిచ్చో అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకులు, తన అభిమానులకు నచ్చేలా ఉండే స్టోరీలనే ఎన్నుకుంటారట అతను. తమిళంలో ముందు వరుసలో ఉన్న హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగులో వచ్చిన ‘నాన్న’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో విక్రమ్ తో నటించిన బాల తార పొన్నియిన్ సెల్వల్ లో విక్రమ్ కే క్రష్ గా నటించింది. ఆమె ఎవరంటే సారా అర్జున్. బాల నటిగా మెంటల్లీ డిజేబుల్ అయిన నన్నంటే ఎంత ప్రేమ చూపించిందో అందరికీ తెలుసే ఉంటుంది. ఇప్పడు ఆమె పొన్నియిన్ సెల్వన్ లో చిన్న తనంలో ఉన్న విక్రమ్ కు చిన్న తనంలో ఉన్న ఐశ్వర్యారాయ్ పాత్రలో నటించడంతో నెట్టింట్లో మీమ్స్ సందడి చేస్తున్నాయి. సారా అర్జున్ పై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.