విక్రమార్కుడు సినిమా చిన్నారి హీరోయిన్ ల యెంత అందంగా ఉందో తెలుసా…ఫోటోలు వైరల్…


సినిమా ఇండస్ట్రీలో చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తిరుగులేని సూపర్ స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు.శ్రీదేవి,మహేష్ బాబు,కమల్ హాసన్,జూనియర్ ఎన్టీఆర్ ఇలా చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా ఎదిగారు.అయితే మరికొంత మంది హీరోలు చిన్నప్పుడు బాల నటుడిగా చేసిన కూడా ఆ విషయం చాల మందికి తెలియదు.అల్లు అర్జున్ బాల నటుడిగా రెండు సినిమాలలో చేసారు అనే సంగతి చాల మందికి తెలియదు అని చెప్పచ్చు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన విజేత మరియు కమల్ హాసన్ హీరోగా చేసిన స్వాతి ముత్యం సినిమాలో అల్లు అర్జున్ బాల నటుడిగా చేయడం జరిగింది.ఇక హన్సిక,రాశి,కీర్తి సురేష్ వంటి వారు కూడా చాల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో నేహా తోట కూడా ఒకరు.

vikramarkudu child artist Neha Thota
vikramarkudu child artist Neha Thota

ప్రముఖ దర్శకుడు రాజమౌళి మరియు హీరో రవి తేజ కంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో రవి తేజ కు కూతురిగా నటించిన చిన్నారి నేహా తోట గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.విక్రమార్కుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేహా తోట ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రక్ష సినిమాలో తన నటనతో అందరిని భయపెట్టింది.

ఆ తర్వాత నేహా కు వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టిన ఆమె తల్లి తండ్రులు మాత్రం ఆమె చదువును దృష్టిలో పెట్టుకొని సినిమాలకు దూరంగా ఉంచారు.ప్రస్తుతం నేహా తోట కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

vikramarkudu child artist Neha Thota
vikramarkudu child artist Neha Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *