Virat Kohli: తన సతీమణి కోసం ఉన్నపలంగా ముంబై వెళ్లిన విరాట్..ఆ వార్త నిజమేనా

Virat Kohli

Virat Kohli: 2023 లో ఐసిసి వన్ డే ప్రపంచ కప్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలో గూహతి లో భారత్ ఆడాల్సిన మొదటి వార్మ్ అప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది.ఇక రెండవ వార్మ్ అప్ మ్యాచ్ కోసం భారత ప్లేయర్స్ అందరు తిరువనంతపురం చేరుకున్నారు.అయితే స్టార్ బాట్స్మన్ కోహ్లీ వార్మ్ అప్ మ్యాచ్ కోసం తిరువనంతపురం వెళ్లలేదని సమాచారం.కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మ కోసం ఉన్నఫళంగా ముంబై వెళ్లినట్లు పలు స్పోర్ట్స్ అండ్ జాతీయ మీడియా సంస్థలు తమ కథనాలతో పేర్కొన్నాయి.

గూహతి లో మొదటి వార్మ్ అప్ మ్యాచ్ తర్వాత భారత ప్లేయర్స్ అందరు ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం కేరళ చేరుకున్నారు.అయితే కోహ్లీ తమ టీం అనుమతి తీసుకుని ముంబై వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.విరాట్ కోహ్లీ వ్యక్తి గత కారణం తో ముంబై వెళ్లినట్లు ఒక బిసిసిఐ అధికారి ధృవీకరించినట్లు పలు మీడియాలో కథనాలు వచ్చాయి.కోహ్లీ సోమవారం నాటికి తిరిగి జట్టులో చేరతాడని తెలుస్తుంది.ఇక మంగళవారం రెండో వార్మ్ అప్ మ్యాచ్ జరగనుంది.విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ రెండో సారి తల్లికాబోతున్నట్లు ఇదివరకే కొన్ని వార్తలు వినిపించాయి.

అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఉన్నఫళంగా ముంబై వెల్లడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదివరకు విరాట్ కోహ్లీ అనుష్క జంట ఒక గైనకాలజి ఆసుపత్రి దగ్గర కనిపించినట్లు కూడా పలు మీడియాలో వార్తలు వచ్చాయి.తన సతీమణి అనుష్క కోసమే విరాట్ ఉన్నఫళంగా గూహతి నుంచి ముంబై వెళ్లినట్లు తెలుస్తుంది.ఇక ఈ జంట త్వరలోనే తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది అని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *