Vishnu Priya: యాంకర్స్ అంటే ఒకప్పుడు గల గలా మాట్లాడేవారు అని తెలిసిందే.కానీ ప్రస్తుతం యాంకర్లు తమ గ్లామర్ తో కూడా అందరిని మెస్మరైస్ చేస్తున్నారు.ప్రస్తుతం రాణిస్తున్న యాంకర్లు ఎక్స్ పోజ్ చేసే విషయంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు అని చెప్పచ్చు.ఈ చిన్ననాటి ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి కూడా ప్రస్తుతం యాంకర్ గా బాగా రాణిస్తుంది.
షార్ట్ ఫిలిం తో తన కెరీర్ ను మొదలు పెట్టిన ఈ చిన్నది ఆ తర్వాత పలు సినిమాలలోనూ ప్రేక్షకులను మెప్పించింది.రాను రాను గ్లామర్ డోస్ పెంచుతూ ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.ఆరడుగులు ఎత్తు ఉండే ఈమె ఒక తెలుగమ్మాయి.సుడిగాలి సుధీర్ తో ఈమె చేసిన షో పోరా పోవే ద్వారా ఈమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఆ తర్వాత పలు షో లు ఫెస్టివల్ ఈవెంట్స్ లో కూడా ఈమె యాంకర్ గా వ్యవహరించింది.ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు ప్రస్తుతం యాంకర్ గా ఫుల్ క్రేజ్ లో ఉన్న విష్ణు ప్రియా.పోరా పోవే షో ద్వారా యాంకర్ గా చేసిన విష్ణు ప్రియా ఆ తర్వాత మూడు సంవత్సరాలు ఈటీవీ లోనే యాంకర్ గా పలు షో లు చేసింది.పండుగాడ్ సినిమాలో కూడా ఈమె ఇటీవలే నటించడం జరిగింది.జరీ జరీ పంచెకట్టి అనే ఆల్బమ్ తో అందరిని ఆకట్టుకుంది విష్ణు ప్రియా.