సుధీర్ పాటకు విష్ణు ప్రియా క్రేజీ డాన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే…వీడియొ వైరల్…


హీరోయిన్లకు తక్కువేం కాదు అని అనిపించే హాట్ యాంకర్లలో విష్ణు ప్రియా కూడా ఒకరు.ఈమెకు ఉన్న క్రేజ్ గురించి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఫన్ బకెట్ తో ఈమె మంచి పాపులారిటీని దక్కించుకుంది.ఆ తర్వాత బుల్లితెర మీద దగ్గుపాటి రానా హోస్ట్ గా చేసిన నెంబర్ వన్ యారీ షోలో ఈమె సహాయకురాలిగా చేసింది.బుల్లితెర మీద యాంకర్ గా పలు షోలలో చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

ప్రముఖ ఛానల్ లో వచ్చిన పోవే పోరా షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసింది ఈ అమ్మడు.ఈ షోలో తన గ్లామర్ తో హాట్ ఇమేజ్ ను సంపాదించుకుంది విష్ణు ప్రియా.అతితక్కువ సమయంలో తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యాంకర్లలో ఈమె కూడా ఒకరు అని చెప్పచ్చు.

ఇక ఈమె పోవే పోరా షో ద్వారా బాగా ఫేమస్ అయ్యింది అని చెప్పచ్చు.ఆ షో ముగిసిన తర్వాత ఈమెకు అంతగా అవకాశాలు రాలేదు.సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉండే విష్ణు ప్రియా తన లేటెస్ట్ ఫోటోలను,వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.పర్పుల్ కలర్ డ్రెస్ లో తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఈమె షేర్ చేసిన వీడియొ ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియొ ఆమె అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *