టాలీవుడ్ లో ఫలక్ నుమా దాస్,హిట్,అశోక వనములో అర్జున కళ్యాణం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యిన హీరో విశ్వక్ సేన్.ఈ హీరో కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.విశ్వక్ సేన్ పలు వివాదాలతో వార్తల్లో నిలిచినా ఇటీవలే రిలీజ్ అయినా అశోక వనములో అర్జున కళ్యాణం అనే చిత్రంతో భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నారు.పలు ఏరియాలలో ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుందని సమాచారం.ఈ హీరో తాజాగా ఒక కొత్త కారును కొనుగోలు చేసారు.
విశ్వక్ సేన్ ఈ కారు కోసం ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేసారని వార్తలు వస్తున్నాయి.బెంజ్ జి క్లాస్ 2022 మోడల్ కారును విశ్వక్ సేన్ కొనుగోలు చేసారు.నా డ్రీం కారును నిన్ననే కొనుగోలు చేసానని విశ్వక్ సేన్ చెప్పడం జరిగింది.అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు వలన ఇది సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు.నెటిజన్లు ఈ కారు ఖరీదు చూసి అవాక్కవుతున్నారు.

ప్రస్తుతం వరుస విజయంలో దూసుకు పోతున్న విశ్వక్ సేన్ చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయని సమాచారం.ఈయన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఆయన అభిమానులు కొత్త కారు కొనుగోలు చేసినందుకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ఫోటోల గురించి స్పందిస్తూ ఆ కారు తనదేనని విశ్వక్ సేన్ ఫోటోలు దిగుతానంటే ఇచ్చానని సరదాగా కామెంట్స్ చేసారు.