వ్యాపారంలో లాభాల కోసం ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..

వ్యాపారం ఏదైనా కానీ లాభం నష్టము అనేవి రెండు ఉంటాయి.అయితే కొంతమందికి మాత్రం ప్రతిసారి వ్యాపారంలో నష్టమే ఎదురవుతూ ఉంటుంది.అలా వ్యాపారంలో నష్టం రాకుండా లాభం రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.అవి ఏంటంటే..డబ్బును దాచే ఖజానా పైన కానీ లేదా లోపల కానీ ఎర్రటి గుడ్డలో కొద్దిగా సోపును వేసి కట్టి పెట్టాలి. 43 రోజులు గుడ్డను అక్కడే ఉంచి ఆ తర్వాత ఆలయానికి సమర్పణ చేయాలి.ఆ తర్వాత మల్లి కొత్త సోపు ఉన్న గుడ్డను గాలిలో లేదా ములలో వేలాడదీయాలి.ఇలా పాటించడం వలన ఆర్ధిక సమస్యలు ఏవైనా ఉంటె అవి తొలగిపోయి ధనలాభం కలుగుతుంది.

అలాగే వ్యాపారానికి ఏదైనా దిష్టి తగులుతుందని భావించిన లేదా ఎప్పుడు నష్టం వస్తున్నా,డబ్బు సంపాదన సరిగ్గా లేదని భావిస్తే దివాళి రోజు రాత్రి లక్ష్మి దేవికి పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను తప్పనిసరిగా పెట్టాలి.ఈ కొబ్బరిని పూజించిన తర్వాత డబ్బును దాచే పెట్టెను అక్కడ 43 రోజుల పాటు పట్టాలి.ఆ తర్వాత ఆ కొబ్బరికాయను తీసి నీటిలో విడిచిపెట్టాలి.ఈ పరిహారం చేయడం వలన ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి అని నిపుణులు చెప్తున్నారు.అదే ఉద్యోగం చేసే వ్యక్తి అయితే జీతం సరిపోకపోయిన లేదా యెంత కష్టపడినా కూడా లాభం రావడం లేదు అని భావిస్తే మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో మొదటి బుధవారం నుంచి ఆరు బుధవారాలు మట్టితో చేసిన కొత్త నీటి కుండను దానం చెయ్యాలి.

ఇలా ఈ పరిహారం చేయడం వలన ఉపాధి పెరిగి వివిధ వనరుల నుంచి ఆదాయం పొందుతాడు అని నిపుణులు చెప్తున్నారు.ఏవైనా కొన్ని కారణాల వలన వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సమస్యలు ఉంటె ప్రతి ఆదివారం ఆవులకు ఒకటిన్నర కిలోల గోధుమ పిండిని తినిపించాలి.ఇలా చేయడం వలన సానుకూల ఫలితాలను పొంది పురోగతిని సాధిస్తారు అని నిపుణులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *