ప్రపంచం మొత్తం కూడా బంగారం అంటే చాల విలువైనదిగా భావిస్తారు.మార్కెట్ లో ఏ వస్తువుకు కూడా లేని డిమాండ్ బంగారానికి ఉంది అని చెప్పడంలో సందేహం లేదు.ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో శుభకార్యాలకు బంగారాన్ని కొనుగోలు చేస్తారు.అయితే బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత దానిని పింక్ కలర్ పేపర్ లో చుట్టి ఇస్తారు.అయితే బంగారాన్ని పింక్ కలర్ పేపర్ లోనే ఎందుకు ఇస్తారో అనేది చాల మందికి తెలియదు.
ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు దాని బ్యాక్ గ్రౌండ్ లోని కలర్ ఆ వస్తువును హైలెట్ చేసే విధంగా చూసుకుంటారు.హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్ లో చుట్టూ అంతా ఆకుపచ్చని బ్యాక్ గ్రౌండ్ ఉండేలా చూసుకుంటారు.
బంగారం ఎక్కువగా మెరుస్తూ ఉంటుంది కాబట్టి దాని వెనుకాల ఉండే బ్యాక్ గ్రౌండ్ బాగా కనిపించడానికి బంగారం వెండి వస్తువులను పింక్ పేపర్ లో పెట్టి ఇస్తారు అమ్మకదారులు.నలుపును చాల మంది అశుభ సూచికంగా భావిస్తారు.అందుకే ఇతర రంగులు కాకుండా పింక్ కలర్ లో బంగారాన్ని చుట్టి ఇస్తారు.ప్రస్తుతం ఉన్న జ్యూవెలరీ షాపులలో బంగారాన్ని బాక్స్ లలో పెట్టి ఇస్తున్నారు.