బుల్లితెర మీద ప్రసారం అవుతున్న షో లలో జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఈ షో చాల మందికి జీవితాన్ని ఇచ్చింది అని చెప్పచ్చు.గత కొన్ని సంవత్సరాలుగా గురువారం,శుక్రవారం ప్రసారం అయ్యే ఈ షో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వస్తుంది.ఈ షో కు రాను రాను ఆదరణ తగ్గిపోతుంది.ఈ షో నుంచి మెల్లమెల్లగా ఒక్కో ఆర్టిస్ట్ వెళ్లిపోవడమే దీనికి కారణం అని చెప్పచ్చు.ఈ షో నుంచి 2019 సంవత్సరంలో జడ్జి గా వ్యవహరించే నాగబాబు తో పాటు పలువురు ఆర్టిస్ట్ లు బయటకు వెళ్లిపోయారు.
జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చేసి వేరే షో లలో సెటిల్ అయినా వాళ్ళు చాల మంది ఉన్నారు.ఇటీవలే ఈ షో కు జడ్జి గా వ్యవహరించే రోజా గారికి మంత్రి పదవి రావడంతో ఆమె కూడా ఈ షో నుంచి బయటకు వెళ్ళిపోయినా సంగతి అందరికి తెలిసిందే.కొత్త కొత్త టీంలు ఈ షో లోకి ఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఇదివరకటి టీం లు నవ్వించినంత నవ్వించలేకపోతున్నారు.ఈ షో నుంచి ఇప్పటికే ముక్కు అవినాష్,చమ్మక్ చంద్ర,అదిరే అభి,ఆర్పీ,అప్పారావు ఇలా కొంత మంది ఆర్టిస్టులు బయటకు వచ్చేసారు.ఆ తర్వాత నుంచి జబర్దస్త్ ను హైపర్ ఆది.ఎక్స్ట్రా జబర్దస్త్ ను సుడిగాలి సుధీర్ ఒంటి చేత్తో నెట్టుకొస్తున్నారు.ప్రస్తుతం హైపర్ ఆది,సుడిగాలి సుధీర్ కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే కొన్ని వారాల నుంచి హైపర్ ఆది షో లో కనిపించకపోవటంతో ఆ వార్త నిజమే ఏమో అన్న అనుమానం చాల మందిలో కనిపిస్తుంది.గతవారంలో ఆటో రామ్ ప్రసాద్,సుడిగాలి సుధీర్ మరియు గెట్ అప్ శ్రీను లేకుండానే స్కిట్ చేసాడు.జబర్దస్త్ షో లో ఏదో జరుగుతుంది అన్న అనుమానం అందరిలోనూ కలుగుతుంది.అయితే ఆర్టిస్టులు ఈ షో ను వదిలిపోవడానికి గల సరైన కారణాలు మాత్రం ఎవరికి తెలియడం లేదు.